E-Paper
Advertisement

Trump: ఫోర్డ్ ఫ్యాక్టరీలో ట్రంప్‌కు నిరసన.. మధ్య వేలితో బదులు, వీడియో వైరల్

Trump: ఫోర్డ్ ఫ్యాక్టరీలో ట్రంప్‌కు నిరసన.. మధ్య వేలితో బదులు, వీడియో వైరల్
Advertisement

Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేసినా నిత్యం వార్తల్లో నానుతున్నారు. ఎనిమిది పదుల వయసొచ్చినా ఆయనలో ఏ మాత్రం కోపం తగ్గలేదు. తన మీద ఆందోళన చేస్తారా అంటూ భగ్గుమన్నారు. చేతి మధ్య వేలి ఫింగర్‌తో ఆందోళన చేసినవారికి బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఫోర్డ్ ఫ్యాక్టరీలో ట్రంప్‌కు నిరసన

Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ ప్రాంతానికి వెళ్లినా వివాదాలు మొదలవుతున్నాయి. తాజాగా మిచిగాన్‌ టూర్‌లో ఆయనకు అలాంటి పరిస్థితి ఎదురైంది. ఫోర్డ్ మోటార్ ప్లాంట్లో ట్రంప్ పర్యటిస్తుండగా ఓ కార్మికుడు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ సైగ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Advertisement

మంగళవారం మధ్యాహ్నం అధ్యక్షుడు ట్రంప్ మిచిగాన్‌లోని డియర్‌బోర్న్‌లో ఫోర్డ్ ఉత్పత్తి చేస్తున్న ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీలో నడుస్తుండగా ఓ కార్మికుడు ‘పీడోఫైల్ ప్రొటెక్టర్’ అని గట్టిగా అరిచాడు. కార్మికుడి అరుపులు గమనించిన ట్రంప్, నోటితో ఓ పదాన్ని ఉచ్చరిస్తూ చేతి మధ్య వేలు చూపించినట్లు వీడియోలో రికార్డ్ అయింది.

మధ్య వేలితో కార్మికుడికి బదులు.. వీడియో వైరల్

ఈ వీడియోను మొదట టీఎమ్‌జడ్ అనే వెబ్‌సైట్ ప్రచురించింది. జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఆ కార్మికుడు ఆ విధంగా నినాదం చేసినట్లు చెబుతున్నారు. ఇంతకీ పీడో ఫైల్ ప్రొటెక్టర్’ అంటే ఏంటో తెలుసా? బాలల లైంగిక వేధింపుల రక్షకుడు అన్నమాట. మిగతా ఫోర్డ్ ఉద్యోగులు ఉత్సాహంగా పలకరించి ఆయనతో , ఫోటోలు దిగుతూ కరచాలనం చేశారు.

ఈ వ్యవహారంపై వైట్హౌస్ రియాక్ట్ అయ్యింది. అధ్యక్షుడి చర్యను సమర్థించింది. దీనికి సంబంధించి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చుంగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ ఉన్మాది కోపంతో పిచ్చిగా అరుస్తూ దూషించాడని, దానికి అధ్యక్షుడు సరైన సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.

ALSO READ: షాకింగ్.. పాము కరిచిందని దాన్ని జేబులో వేసుకుని

ఇదిలావుండగా నినాదాలు చేసిన కార్మికుడ్ని ఫోర్డ్ కంపెనీ సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. తాను చేసిన పనికి ఎలాంటి పశ్చాత్తాపం లేదంటూ సదరు కార్మికుడు ఓ వార్తా సంస్థతో చెప్పాడు. తమ కంపెనీలో అమర్యాదకర ప్రవర్తనను సహించబోమని ఆ కంపెనీ చెప్పింది. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది ఫోర్డ్ కంపెనీ.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×