AUS VS PAK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Pakistan vs Australia) మధ్య వన్డే సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల చివరలో పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్ షురూ అవుతుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆడే ప్లేయర్లను వదిలేసి, మిగిలిన ప్లేయర్లను ఫైనల్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. కొంత మంది కొత్త క్రికెటర్లను కూడా బరిలోకి దించుతోంది.
Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అందరూ దొంగలే..పెళ్లి చేసుకుంటానని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !
ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఈ నెల 30వ తేదీ నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. 30వ తేదీన మొదటి వన్డే జరగనుండగా జూన్ రెండవ తేదీన రెండో వన్డే నిర్వహిస్తారు. జూన్ 4వ తేదీన చిట్టచివరి వన్డే మ్యాచ్ ఉంటుంది. ఈ మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో భారత సంతతికి చెందిన నిఖిల్ చౌదరి ( Nikhil Chaudhary) కూడా పాకిస్తాన్ లో అడుగుపెట్టనున్నాడు. కీలక ప్లేయర్లు అందరూ ఐపీఎల్ ఆడనున్న నేపథ్యంలో.. నిఖిల్ చౌదరికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వాస్తవంగా ఇండియాకు సంబంధించిన ఏ క్రికెటర్ కూడా బీసీసీఐ రూల్స్ ప్రకారం పాకిస్తాన్ లో పర్యటించబోడు. కానీ నిఖిల్ చౌదరి మాత్రం పాకిస్తాన్ లో పర్యటించబోతున్నాడు. అతనికి ఆస్ట్రేలియా పౌరసత్వం ఉన్న నేపథ్యంలో ఈ అవకాశం లభించింది.
పాకిస్తాన్ లో పర్యటించబోతున్న నిఖిల్ చౌదరి ఇండియాలోని పంజాబ్ లోనే జన్మించాడు. 2020లో మెరుగైన అవకాశాల కోసం ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. దానికి తగ్గట్టుగానే ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగలో హోబర్ట్ హరికేన్స్ జట్టు తరఫున నిఖిల్ ప్రదర్శన కనబరిచాడు. తనదైన దూకుడు బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ చేయగల సమర్థుడు. బిగ్ బాష్ లీగ్ లో సక్సెస్ అయిన నేపథ్యంలో అతన్ని ఇప్పుడు పాకిస్తాన్ వన్డే సిరీస్ కోసం సెలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఆస్ట్రేలియా పౌరసౌత్వం ఉన్న తరుణంలో నిఖిల్ చౌదరి పై బీసీసీఐ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.
పాకిస్థాన్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ఇప్పటికే ఫైనల్ చేసినట్లు ఓ పోస్ట్ కూడా వైరల్ గా మారింది.
మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, కామెరాన్ గ్రీన్, మార్నస్ లాబుషేన్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్ & మాథ్యూ రెన్‌షా జట్టులో ఉండే అవకాశం ఉంది. ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ & జోష్ హేజిల్‌వుడ్ జట్టులో ఉండరు. ఐపీఎల్ కారణంగా కూపర్ కానలీ, జేవియర్ బార్ట్‌లెట్, బెన్ డ్వార్షుయిస్ & మాథ్యూ షార్ట్ ఈ సిరీస్‌కు దూరమవుతారు. ఓలీ పీక్, జోయెల్ డేవిస్, తన్వీర్ సంఘా & నిఖిల్ చౌదరి పాకిస్థాన్‌లో ఆడే అవకాశం ఉంది.
Indian-origin Nikhil Chaudhary will be selected by Australia to play against Pakistan in June.
After getting smashed by the likes of Kohli and Rohit, Pakistan is all set to get a drubbing from Indian-origin Australian. pic.twitter.com/NxyVAkIDSd
— Brutal Truth (@sarkarstix) May 8, 2026