Land Fraud: స్వేచ్ఛ బ్యూరో: జిల్లాలో రెవెన్యూ శాఖ అధికారులు విలువైన భూముల విషయంలో రికార్డులను తారుమారు చేసి తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రెవెన్యూ అధికారులు గద్వాల శివారులో సర్వే నంబర్ 780లో 16 ఎకరాల ఒక గుంట ఉంది. ఇందులో సర్వేనెంబర్ 780 బై ఏ 780/82 భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల అక్రమ మార్పులు అధికార దుర్వినియోగం పై ఇటీవల జిల్లా కలెక్టర్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 780/ఎ లో చిన్న తిమ్మప్పకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ఇదే భూమిలో 1.02 గుంటల భూమి వివిధ అవసరాల నిమిత్తం గవర్నమెంట్ కు అవార్డు అయ్యింది. ఇదే సర్వే నంబర్ లో రిజిస్టర్ దస్తావేజు నెంబర్ 934/1987 రెండు ఎకరాలు ప్లాట్లు చేయగా అదనంగా 0 38 గుంటల భూమి విక్రయించారు. అవార్డు అయిన 1.02 భూమి, కేవలం 28 గుంటల భూమికి మాత్రమే భూభారతి రికార్డు చూపించారు.
రెండు ఎకరాల విక్రయించిన భూమి తీసివేయలేదు. అదనంగా స్క్వేర్ యార్డ్స్ చొప్పున విక్రయించిన 0.38 గుంటల భూమిని కూడా రికార్డుల్లో తొలగించలేదు. అయితే కేవలం చిన్న తిమ్మప్పకు రికార్డుల్లో 0.28 గుంటలు మాత్రమే చూపిస్తున్నారు. మిగిలిన భూమి ఇతరులకు చేశారు. అయితే 1982 నుండి 2004 సంవత్సరం వరకు పహాని,రికార్డులు ఇందుకు సంబంధించి వివరాలు కలిగి ఉన్నాయి. అయితే విక్రయించిన భూమిని రికార్డుల్లో తొలగించకుండా సర్వే నెంబర్ 780/ఎ లో ఇతరులకు ఈ సబ్ డివిజన్ ద్వారా అక్రమంగా వనవాడ పార్వతి దేవికి ప్రోసిడింగ్ ద్వారా 2019లో బి బై 339/2019 లో 1.22 గుంటల భూమి ఉందని రిపోర్టు ఇచ్చారు. ఇదిలా ఉండగా ప్రోసీడింగ్ 2019 లో బి బై 339 బై 2019 ను పరిశీలిస్తే ఈ ప్రొసీడింగ్ లో కేవలం 0.39 గుంటలు మాత్రమే మిగిలి ఉంది. అది కూడా సర్వే నంబర్ 780/C2 లో హనుమక్కదిగా చూపించారు. పార్వతి దేవి కి భూమిలోని చోట తప్పుడు ప్రొసీడింగ్ చేసి బై నెంబర్ క్రియేట్ చేసి సర్వే నంబర్ 780/2 780/82/2 భూ రికార్డును నమోదు చేశారు. అదేవిధంగా ఒకే భూమికి సంబంధించిన సర్వే రికార్డులో తీవ్ర విరుద్ధతలో ఉన్నాయి.
Also Read: ఒక్కసారి కొంటే పదేళ్లు తిరుగుండదు.. లాంగ్ టర్మ్ వాడకానికి బెస్ట్ మిర్రర్‌లెస్ కెమెరాలు ఇవే!
అయితే అక్రమంగా వనవాడ పార్వతి దేవికి ఒక సర్వే రిపోర్ట్ లో ప్రొసీడింగ్ 2019 ప్రకారం సర్వేనెంబర్ 780/8 లో విస్తీర్ణం 1.2 ఎకరాలుగా చూపించగా మరో సర్వే రిపోర్ట్ లో అదే భూమి 2023లో విస్తీర్ణం ఎకరం 15 గుంటలు వనవాడ పార్వతి దేవికి కలెక్టర్ ప్రొసీడింగ్ ద్వారా అప్పటి ధరణి రిపోర్టులో నమోదు చేశారు. ఒకే సర్వేనెంబర్ ఒకే భూమికి రెండు వేరువేరు విస్తీర్ణాలు చూపించడం రికార్డుల అధికారుల విశ్వసనీతపై అనుమానాలు కలుగుతున్నాయి. సరైన కొలతలు, ఫీల్డ్ పరిశీలన, అధికారిక ధ్రువీకరణ లేకుండా విస్తీర్ణ వివరాలు మార్పు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గద్వాల తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ గా విధులు నిర్వహిస్తున్న అధికారి పాత్ర ఇందులో ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. సరైన కొలతలు, ఫీల్డ్ పరిశీలన అధికారిక ధ్రువీకరణ లేకుండా విస్తీర్ణ వివరాలు మార్పు చేసినట్లు స్పష్టంగా ఉందని బాధితులు వాపోతున్నారు. అధికారులు రికార్డుల తారుమారు చేశారని బాధితులు విమర్శిస్తున్నారు.
Also Read: OTT బాగా చూస్తారా? అయితే ఈ ప్లాన్స్ మీకోసమే.. తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ వినోదం!