Influencer Sona Dey: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఇప్పటికే 56 మ్యాచులు పూర్తయ్యాయి. ఇక నిన్నటి రోజున ముంబై వేదికగా…. ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు పదేపదే వర్షం అడ్డంకి కావడంతో… DLS రూల్ ప్రకారం గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ జట్టుపై ఏకంగా మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ చివరగా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ముంబై ఇండియన్స్ వరుస విజయాలకు బ్రేక్ పడినట్లు అయింది.
Also Read: IPL 2025 – Operation Sindoor: పాకిస్థాన్ పై యుద్ధం.. IPL 2025 రద్దు.. బీసీసీఐ ప్రకటన ఇదే ?
లవర్స్ ను విడగొట్టిన హార్థిక్ పాండ్యా
భార్య నటాషాను వదిలేసి సింగిల్ గా ఉంటున్న హార్దిక్ పాండ్యా ఓ జంట విడిపోవడానికి కారణమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మంగళవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా…. ముంబై ఇండియన్స్ కు సపోర్ట్ చేస్తున్న ఓ జంట స్టేడియం కి రావడం జరిగింది. ఆ జంట ఎవరో కాదు సోషల్ మీడియా స్టార్ సోనా. ఈమె నిత్యం హార్దిక్ పాండ్యా ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ రచ్చ చేస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కు తన ప్రియుడ్ని తీసుకొని వచ్చింది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యా స్క్రీన్ పైన కనిపించడంతో ఫ్లైయింగ్ ఇచ్చింది. దీంతో పక్కనే ఉన్న ఆమె ప్రియుడు చాలా సీరియస్ అయ్యాడు. నేను ఉండగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా అని వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా ఆమె తగ్గలేదు. దీంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు ఆ ప్రియుడు. వెళ్ళిపోతే వెళ్ళిపో.. నువ్వు నాకు అక్కర్లేదు అన్న రేంజ్ లో… ఆ బ్యూటీ కూడా… తెగేసి చెప్పేసింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు… రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా కారణంగా ఓ జంట విడిపోయిందని ఫైర్ అవుతున్నారు. అయితే ఈ వీడియో కావాలనే సరదా కోసం పెట్టినట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా… హార్దిక్ పాండ్యా ఇప్పటికే తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఐపీఎల్ సీజన్ సమయంలోనే తన భార్య నటాషాకు అధికారికంగా విడాకులు ఇచ్చాడు హార్థిక్ పాండ్యా. దీంతో తన కుమారుడు అగస్త్య పాండ్యా తన తల్లి నటాషా తోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే తన తండ్రి వద్దకు వస్తున్నాడు.
Also Read : Hardik Pandya: గుజరాత్ తో హార్దిక్ పాండ్యా ఫిక్సింగ్..ఒకే ఓవర్ లో 11 బంతులు, 18 పరుగులు !
?igsh=MWI5bjd4MTU2azhvcw%3D%3D