Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరిగింది. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Mumbai Indians vs Gujarat Titans ) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ రెండు జట్లు తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. అయితే ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై ( Hardik Pandya ) తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టుకు అమ్ముడుపోయాడని అతనిపై విమర్శలు.. చేస్తున్నారు. అయితే అలా ట్రోలింగ్ చేయడం వెనుక కారణం లేకపోలేదు.
Also Read: Ads In IPL : ఒక్క యాడ్ కు ఇన్ని లక్షలా… ఈ లెక్కలు తెలిస్తే జనాలు పిచ్చోళ్ళు రావడం పక్కా !
ఒకే ఓవర్లో 11 బంతులు, 18 పరుగులు
ప్రతి మ్యాచ్లో అద్భుతంగా ఆడిన హార్దిక్ పాండ్యా.. గుజరాత్ పైన మాత్రం ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. సాయి కిషోర్ బౌలింగ్లో ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు హార్థిక్ పాండ్యా. ఇటు బౌలింగ్లో కూడా చెత్త ప్రదర్శన కనబరిచాడు. చేజింగ్ చేస్తున్న గుజరాత్ జట్టును కట్టడి చేయడంలో హార్దిక్ పాండ్యా అత్యంత దారుణంగా విఫలమవుతున్నాడు. కెప్టెన్సీ పరంగా చెత్త నిర్ణయాలు తీసుకొని.. ముంబై ఇండియన్స్ ఓటమికి కారణమవుతున్నాడు. అలాగే ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 8 ఓవర్ వేశాడు. ఈ ఓవర్ లో ఏకంగా 11 బంతులు వేశాడు హార్థిక్ పాండ్యా.
ఇందులో రెండు నో బాల్స్ కూడా ఉన్నాయి. ఈ 11 బంతుల్లో మొత్తం 18 పరుగులు ఇచ్చేశాడు హార్థిక్ పాండ్యా. దీంతో హార్దిక్ పాండ్యా పై తీవ్రత స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్గా గతంలో హార్థిక్ పాండ్యా పనిచేసిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆ జట్టుకు అమ్ముడుపోయి ముంబై ఇండియన్స్ జట్టును మోసం చేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అంతర్జాతీయ బౌలర్ అయి ఉండి ఒకే ఓవర్లో 11 బంతులు ఎలా వేస్తాడని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లు ఆడిన నేపథ్యంలో 8 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. అయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ 35 పరుగులు అలాగే విల్ జాక్స్ 53 పరుగులు చేయడంతో ఆమాత్రం.. స్కోర్ చేయగలిగింది ముంబై ఇండియన్స్. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఆచితూచి ఆడుతోంది. అయితే గుజరాత్ టైటాన్స్ 107 పరుగులు ఉన్న నేపథ్యంలో వర్షం అడ్డంకిగా మారింది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ పూర్తిగా రద్దు అయినా కూడా డక్వర్తు లూయిస్ ప్రకారం గుజరాత్ కచ్చితంగా విజయం సాధిస్తుంది.
Also Read: Uppal Stadium : ఉప్పల్ గ్రౌండ్ కంటే… బోరబండ గల్లీలే బెటర్… గంగలో కలిసిన HCA పరువు!
That over just kept going! 👀
Hardik Pandya ends up bowling 11 deliveries and leaks 18 runs! 😬#IPL2025 #MIvGT #HardkPandya pic.twitter.com/OIwE3Rujxj
— Sportskeeda (@Sportskeeda) May 6, 2025