IPL 2025 – Operation Sindoor: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ పేరుతో… పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపిస్తోంది ఇండియన్ ఆర్మీ. అర్ధరాత్రి 1 గంటల 44 నిమిషాలకు.. పాకిస్తాన్ ఉగ్రముకలు ఉన్న తొమ్మిది స్థావరాలలో… ఒకసారి గా విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ దాడులు చేస్తోంది. ఈ సంఘటన నేపథ్యంలో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ గురించి ఒక కొత్త చర్చ మొదలైంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ అర్ధాంతరంగా ఆగిపోతుందని కొంతమంది జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ విభాగాలకు అవకాశం ఉండబోదని అంటున్నారు.
Also Read : Hardik Pandya: గుజరాత్ తో హార్దిక్ పాండ్యా ఫిక్సింగ్..ఒకే ఓవర్ లో 11 బంతులు, 18 పరుగులు !
ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ను అర్ధాంతరంగా ఆపేస్తారని కూడా ఆ చర్చ జరుగుతోంది. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్ 2025 టోర్నమెంటు ఆగిపోతుందని వస్తున్న వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా స్పందించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి వెల్లడించింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధానికి అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ఎలాంటి సంబంధం ఉండబోదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
ఆపరేషన్ సిద్దూర్ ప్రభావం మ్యాచుల పై అసలు ఉండబోదని కూడా ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ విషయాన్ని నేషనల్ మీడియా ప్రకటించింది. అయితే పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లో జరిగే మ్యాచ్ లు మాత్రం ఢిల్లీకి మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి దీనిపై ఇంకా భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకోలేదని సమాచారం అందుతోంది. అతి త్వరలోనే దీనిపై నిర్ణయం కూడా తీసుకొని ఉందని సమాచారం. పంజాబ్ లో జరిగే మ్యాచ్ లన్ని ఢిల్లీలో జరిగితే ఎలాంటి ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉండబోదని కూడా చెబుతున్నారు. ఆ దిశగా… భారత క్రికెట్ నియంత్రణ మండలి అడుగులు వేసే ఛాన్స్ ఉంది. ఈ విషయంపై మోడీ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం భారత క్రికెట్ నియంత్రణ మండలి నడుచుకోనుంది.
Also Read: Gandhi Ji with Kohli : RCB 18 ఏళ్ల కల నెరవేర్చిన గాంధీజీ.. సంబరాల్లో విరాట్ కోహ్లీ!
200 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మృతి
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో… ఇప్పటికే 200 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మృతి చెందినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల మారణకాండ నేపథ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది మోడీ ప్రభుత్వం. కీలక స్థావరాలన్నీ ఎగిరిపోయాయి. పాకిస్తాన్ నరకం అనుభవిస్తోంది. ఆ దేశంలో… ఎమర్జెన్సీ పాలన కూడా విధించినట్లు సమాచారం అందుతుంది.