FCDA Building: తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫ్యూచర్ సిటీకి ప్రతిబింబంగా నిలవనున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరుల సమక్షంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు.
హైదరాబాద్ కు అనుసంధానంగా మరో నగరాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో రేవంత్ సర్కార్.. ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే మీర్ ఖాన్ పేట్ లో నిర్మించిన ఎఫ్ సీడీఏ భవనాన్ని రేవంత్ ప్రారంభించారు. అయితే ఈ భవనం నిర్మాణానికి 2025 సెప్టెంబర్ 28న సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. అదే ఏడాది డిసెంబర్ లో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. కేవలం 6 నెలల్లోనే ఈ ఎఫ్ సీడీఏ భవనాన్ని పూర్తి చేయడం విశేషం.
ఇదిలా ఉంటే ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ సంకల్పించారు. ఇందులో భాగంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు 40-60 కి.మీ దూరంలో దీనిని నిర్మించ తలపెట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ పరిధిలోకి మీర్‌ఖాన్‌పేట్, కడ్తాల్, అమంగల్, కందుకూరు, తలకొండపల్లి, మహేశ్వరం తదితర ప్రాంతాలతో పాటు రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ఏరియాలను తీసుకొచ్చింది.
Also Read: రియల్‌మీ కొత్త ఫోన్.. 8000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, AI కెమెరా.. మార్కెట్ షేక్ అవ్వాల్సిందే!
కాగా ఎఫ్ సీడీఏ భవనం ప్రారంభోత్సవానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ పెట్టారు. ఆధునిక భారత్ కు నూతన సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీ ఉండనున్నట్లు పేర్కొన్నారు. దీనిని ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సాంకేతిక సుస్థిరాభివృద్ధికి ప్రతీకగా ఫ్యూచర్ సిటీ మారబోతోందని రేవంత్ చెప్పుకొచ్చారు. కాగా, రూ.20 కోట్లతో 15 వేల చదరపు అడుగల విస్తీర్ణంలో FCDA భవనాన్ని ప్రభుత్వం నిర్మించడం గమనార్హం.
Also Read: అంతా కేసీఆర్ జపం చేస్తున్నారు.. మనం బీఆరెస్‌తో పొత్తుకు పోదాం! కాషాయదళంలో అంతర్మథనం..