E-Paper
Advertisement

IPL 2025 Final: భారీ వర్షం.. ఫైనల్ మ్యాచ్ కు బ్రేక్.. రద్దు అయితే విజేత ఎవరు

IPL 2025 Final: భారీ వర్షం.. ఫైనల్ మ్యాచ్ కు బ్రేక్.. రద్దు అయితే విజేత ఎవరు
Advertisement

IPL 2025 Final:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అలాగే పంజాబ్ కింగ్స్ ( Royal Challengers Bangalore and Punjab Kings ) తలపడబోతున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఏడు గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉండే ఛాన్స్ ఉంది.

Also Read:  PBKS vs RCB final : 10 సంవత్సరాల ఛాలెంజ్.. బుమ్రా యర్కార్లకు శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే ఆన్సర్.. అప్పుడు… ఇప్పుడు అదే షాట్

Advertisement

అయితే మరికాసేపట్లోనే రాయల్ చాలెంజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో…. వర్షం విలన్ గా మారింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో గ్రౌండ్ మొత్తం కవర్స్ తో.. కప్పేశారు. దాదాపు 30 నిమిషాల నుంచి ఈ వర్షపాతం కొనసాగుతోంది. ఈ వర్షం ఇలాగే కొనసాగితే మ్యాచ్ ప్రారంభం చాలా ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇవాళ మొత్తం వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే… రిజర్వ్ డే ఆప్షన్ కూడా ఉంది.

కాబట్టి ఫ్యాన్స్ ఎవరూ టెన్షన్ పడకూడదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇవాళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన కూడా రేపటి రోజున తిరిగి.. మళ్లీ మ్యాచ్ జరుగుతుంది. రేపు కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే… సూపర్ ఓవర్ అయినా నిర్వహిస్తారు. అది సాధ్యం కాకపోతే పాయింట్లు పట్టికలో పంజాబ్ మొదటి స్థానంలో ఉంది కాబట్టి… టైటిల్ ఎగురేసుకుపోతుంది. ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన ఫైనల్ మ్యాచ్ కంటే ముందు… అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా రంగంలోకి దిగాడు. మ్యాచ్ ప్రారంభం కంటే ముందు ఆయన నేరుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంటున్న హోటల్ కి వెళ్లారు. ఈ సందర్భంగా ప్లేయర్లతో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు VS  పంజాబ్ కింగ్స్ జట్లు ఇవే 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ XII: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పటీదార్ (సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్, సుయాష్ శర్మ

పంజాబ్ కింగ్స్ ప్రాబబుల్ XII: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (WK), శ్రేయాస్ అయ్యర్ (c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ విజ్‌కుమారి చరల్

 

Also Read: Shreyas Iyer : మీరు నా ముందు పిల్ల బచ్చాలు… ముంబైని అవమానించిన అయ్యర్.. చూయింగ్ గమ్ ఉమ్మేస్తూ

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×