Shreyas Iyer : ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆదివారం రాత్రి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఊహించని విధంగా పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. అందరూ ముంబై ఇండియన్స్ గెలుస్తుందని భావించారు. కానీ పంజాబ్ కింగ్స్ విజయం సాధించి ఫైనల్ కి దూసుకెళ్లింది. ముంబై జట్టు ఓటమి పాలై ఇంటి ముఖం పట్టింది. జూన్ 03న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. ఈ సారి కొత్త ఛాంపియన్స్ గా మరీ ఎవరు నిలబడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. పంజాబ్ కింగ్స్ జట్టు క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Also Read : PBKS vs RCB final : ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడితే ఎలా… విజేత ఎవరు… అసలు రిజర్వ్ డే ఉంటుందా?
అయితే విజయం సాధించిన అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చూయింగ్ గమ్ ఉమ్మేశాడు. అంటే ముంబై ఇండియన్స్ నా ముందు పిల్ల బచ్చాలు అన్నట్టు వ్యవహరించాడు. అదే సమయంలో ఆయన ఉమ్మించిన సమయంలో నీతా అంబానీ, ఆమె కొడుకు కూడా అటు వైపు వింతగా చూడటం విశేషం. అసలు పంజాబ్ కింగ్స్ జట్టు అని కాదు.. శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున ఆడితే ఆ జట్టు విజయం సాధిస్తుంది. గత సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కి కెప్టెన్ గా వ్యవహరిస్తే.. ఆ జట్టు టైటిల్ గెలిచింది. గతంలో కూడా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్ వరకు వెళ్లింది. ఇలా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ లో ఐపీఎల్ టీమ్ కి అదృష్టం వరిస్తుందనే చెప్పాలి. అందుకే ఈ సారి పంజాబ్ కింగ్స్ జట్టు కూడా విజయం సాధిస్తుందని అభిమానులు పేర్కొంటున్నారు.
క్వాలిఫయర్ 2 లో జరిగిన మ్యాచ్ లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేయగలిగింది. ఇక ఛేజింగ్ కి బరిలోకి దిగిన 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ జట్టు ఇంటి ముఖం పట్టింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా యార్కర్ల స్పెషలిస్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే బుమ్రా యార్కర్లను శ్రేయాస్ అయ్యర్ సరైన సమాధానం చెప్పాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తో కలిసి ప్రీతి జింటా మైదానంలో సంబురాలు జరుపుకుంది. నిన్న జరిగిన మ్యాచ్ పై పంజాబ్ అభిమానులు ముంబై పై ఘోరంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. రేపు జరుగబోయే మ్యాచ్ లో మాత్రం కచ్చితంగా శ్రేయస్ అయ్యర్ కప్ సాధిస్తాడనే ధీమాతో అందరూ భావిస్తున్నారు. ఏం జరుగుతుందనేది రేపు రాత్రి వరకు తేలనుంది.