Telangana: జపాన్‌లోని కిటాక్యుషు నగరం స్ఫూర్తి పొంది.. స్థిరమైన అభివృద్ధిపై దృషి సారించడంలో భాగంగా.. రాష్ట్రంలో 80 ఎకరాల్లో ఎకో- టౌన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం,కిటాక్యుషు నగరానికి మధ్య కుదిరిన పరస్పర సహకార ఒప్పందం ఇందుకు మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. టీహబ్‌లో రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా నిర్వహించిన సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కిటాక్యుషు నగరంతో కలిసి నికర జీరో లక్ష్యాలు, రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్, స్థిరమైన ఆర్థికాభివృద్ధి, క్లీన్ టెక్నాలజీ, అలాగే డిజిటల్ ఆవిష్కరణలతో సహా అనేక భవిష్యత్తు కార్యక్రమాలపై ఫోకస్ చేయనుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జపాన్ నగర మేయర్ కజుహిసా టకేయుచి కూడా పాల్గొన్నారు. పర్యావరణ అనుకూల పారిశ్రామిక మండలాలు, జీరో-వేస్ట్ డిజైన్ సూత్రాలు, అధునాతన నీటీ, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సారించి, రాబోయే ఫ్యూచర్ సిటీని అత్యంత అభివృద్దిగా తీర్చి దిద్దాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ALSO READ: Viral Video : ఒక్క సెకన్‌లో ఎలా బతికిపోయాడో చూడండి.. వైరల్ వీడియో..
తెలంగాణ యువతకు నైపుణ్యం కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. జపాన్ ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర యువతకు జపనీస్ నేర్పించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. హైదరాబాద్- కిటాక్యుషు నగరాల మధ్య విమాన ప్రయాణాలకు అనువుగా అనుసంధానం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. కిటాక్యుషు నగర అభివృద్ధి తెలంగాణ రైజింగ్‌కు సరిపోయేలా ఉందని చెప్పారు.స
ALSO READ: Snake Bite: పాము కాటుతో అమ్మాయి మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
తెలంగాణలో అనుకూలమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జపాన్ పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ అనే లక్ష్యంతో అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్‌గా మార్చాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏడాదిన్నర సమయంలోనే.. రాష్ట్రానికి సుమారు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఎం కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఈవో మధుసూదన్, సీఐఐ తెలంగాణ చైర్మన్ శివప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.