E-Paper
Advertisement

BTech Ravi: వివేకా మర్డర్ కేసు.. అవినాష్ రెడ్డి ఆరోపణలపై.. బీటెక్ రవి సెన్సేషనల్ కామెంట్స్

BTech Ravi: వివేకా మర్డర్ కేసు.. అవినాష్ రెడ్డి ఆరోపణలపై.. బీటెక్ రవి సెన్సేషనల్ కామెంట్స్
Advertisement

కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని హరిజనవాడలో పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి పర్యటించారు. అక్కడ నిర్మించ తలపెట్టిన ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమం అనంతరం హరిజనవాడకు చెందిన 20 కుటుంబాలు బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీటెక్ రవి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు.

అవినాష్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లు చూస్తుంటే ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలనిపిస్తోందని బీటెక్ రవి ఎద్దేవా చేశారు. వివేకా మరణం తర్వాత గుండెపోటు అనే పదాన్ని తొలుత సృష్టించి వాడుకున్నది అవినాష్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. హత్య జరిగిన చోటుకు వెళ్లి సాక్ష్యాలను తారుమారు చేసిన వ్యక్తులు ఈరోజు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్పాట్ నిర్ణయించింది, అక్కడికి వెళ్లింది, ఆపై క్లీన్ చేసింది అంతా వైసీపీ నాయకులేనని ఆరోపించారు. సాక్ష్యాలను తారుమారు చేస్తే ఎదుర్కోవాల్సిన సెక్షన్ 201 తీవ్రత ఏంటో ఎంపీకి తెలుసా అని నిలదీశారు. చేసిన తప్పుల నుంచి ఆయన ఎప్పటికీ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

Advertisement

వివేకా కుమార్తె సునీత గురించి అవినాష్ మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉందని రవి మండిపడ్డారు. సునీతే గుండెపోటు అని చెప్పారని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ఆమె చంద్రబాబుకు సహకరిస్తున్నారని అనడం విడ్డూరంగా ఉందని కొట్టిపారేశారు. చంద్రబాబుకు సునీత సహకారం అవసరం లేదని చెప్పారు. నిజానికి సునీతకు రాజకీయ కోరిక ఉండి ఉంటే ఈరోజు అవినాష్ రెడ్డి ఎంపీ అయ్యేవాడే కాదని గుర్తు చేశారు. ఆమె పెట్టిన రాజకీయ భిక్ష వల్లే అవినాష్ పదవిలో ఉన్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

హత్య కేసులో ముద్దాయిగా ఉండి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్యక్తికి వివేకా కేసు గురించి మాట్లాడే అర్హత లేదని బీటెక్ రవి స్పష్టం చేశారు. కర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, చేసిన పాపాలు ఏదో ఒక రోజు వెంటాడుతాయని హెచ్చరించారు. అవినీతికి పాల్పడినందు వల్లే సీఐ అశోక్ రెడ్డి సస్పెండ్ అయ్యారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Advertisement

ALSO READ: Longest Beaches: ప్రపంచంలో అత్యంత పొడవైన బీచ్ లు ఇవే, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే!

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×