E-Paper
Advertisement

IPL 2026-LPG Crisis: ఐపీఎల్ పై నీలి నీడ‌లు..గ్యాస్ కొర‌త‌తో టోర్న‌మెంట్ ర‌ద్దు?

IPL 2026-LPG Crisis: ఐపీఎల్ పై నీలి నీడ‌లు..గ్యాస్ కొర‌త‌తో టోర్న‌మెంట్ ర‌ద్దు?
Advertisement

IPL 2026 – LPG Crisis: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ పై ( Indian Premier League 2026 Tournament ) నీలి నీడలు పడ్డాయి. యుద్ధం ఎఫెక్ట్.. ఐపీఎల్ పై ప‌డ్డ‌ట్టు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. అమెరికాను ఏమీ చేయలేక గల్ఫ్ దేశాలకు చుక్కలు చూపిస్తోంది ఇరాన్. అయితే ఇలా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో, ఇండియాకు పెను ముప్పు వచ్చింది. ఎల్పీజీ కొరత ఇండియాలో ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండియాలో చమురు, ఎల్పీజీ నిల్వలు ( LPG Crisis ) క్రమక్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో దీని ఎఫెక్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ పైన పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Pak On Team India: అంతా ఫిక్సింగే..టీమిండియా విజ‌యం వెనుక‌ అమిత్ షా, ధోని, రోహిత్ కుట్రలు ?

ఐపీఎల్ పై నీలి నీడలు.. గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడే ప్రమాదం !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament )  అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మరో 18 రోజుల్లోనే ఈ మెగా టోర్నమెంట్ షురూ అవుతుందని చెబుతున్నారు. మార్చి 12వ తేదీన అంటే ఎల్లుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. మార్చి 28వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ మెగా ఈవెంట్ ఇండియాలోనే జరగనుంది. అయితే మధ్య ప్రాచ్య దేశాల ఉద్రిక్తతల కారణంగా ఇంధన కొరత, క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ల కొరత ఏర్పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైతే విదేశీ ప్లేయర్లు, మన దేశీయ ప్లేయర్లు అందరూ పెద్దపెద్ద హోటల్లలో బస చేయాల్సి ఉంటుంది.

క్రికెటర్లు వస్తే కచ్చితంగా ఇండియన్ వంటకాలు వాళ్లకు స్పెషల్గా తయారుచేసి అందించాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ల కొరత ఇండియా వ్యాప్తంగా స్పష్టంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ప్రారంభమైతే క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ల వినియోగం మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ ఆడే క్రికెటర్లకు హోటల్స్ ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తాయని దానిపైన టెన్షన్ నెలకొంది. గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడితే.. హోటల్స్ లో భోజనం దొరకడం కష్టమే అంటున్నారు. ముఖ్యంగా బెంగ‌ళూరు, ముంబై లాంటి న‌గ‌రాల్లో హోట‌ళ్ల‌కు క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్లు దొర‌క‌డం లేద‌ని అంటున్నారు. మరి ఈ పెను సవాళ్లను ఐపీఎల్ యాజమాన్యంతో పాటు భారత సర్కార్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడంటే ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభమై అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 12వ తేదీన ఈ టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కొనసాగనుంది.

Also Read: Sahibzada Farhan: ఐసీసీని కోర్టుకు ఈడ్చుతా..నాకు ద‌క్కాల్సిన అవార్డ్, సంజుకు ఎలా ఇస్తారు ?

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×