E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా దెబ్బకు ప్రభా షాక్.. అన్నదమ్ముల సీన్ కేక.. మీనా, చింతామణి వార్..

Gundeninda GudiGantalu Today episode: మీనా దెబ్బకు ప్రభా షాక్.. అన్నదమ్ముల సీన్ కేక.. మీనా, చింతామణి వార్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode may 28th : తాగద్దని ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం మీనా మాట వినకుండా తాగేసి ఇంటికి వస్తాడు.. దానికి మీనా చాలా సీరియస్ అవుతుంది.. ఇదంతా చెప్తున్న సరే వినకుండా నువ్వు తాగేసి వస్తావా అని బాధపడుతుంది. అటు రోహిణి పై మనోజ్ కి అనుమానం రావడంతో అడుగుతాడు దాంతో వీళ్ళిద్దరూ కాస్త గొడవ పడతారు.. ఇక రవి శృతి లు కూడా గొడవ పడతారు. రాత్రి అందరూ భోజనం చేయడానికి కూర్చుంటే ముగ్గురు మగాళ్లు మాత్రమే అక్కడ కూర్చుని ఉంటారు. రోహిణి మీనా శృతి ముగ్గురు వీళ్ళ తిన్న తర్వాత మేము వచ్చి తింటాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. అసలేం జరిగింది ఎందుకు మీరు అందరు ఇలా ఉన్నారు అని ప్రభావతి ఎంత అడుగుతున్నా సరే ఎవ్వరు కూడా మాట విప్పకుండా అక్కడ నుంచి..

కన్ఫ్యూజన్లో ప్రభావతి..

అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని ప్రభావతి అడుగుతుంది.. కానీ ముగ్గురు మాత్రం సమాధానం చెప్పకుండా ఉంటారు. మీ పెళ్ళాలకు ఏమైంది రా? ఎందుకు మీ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు.. తనకి ఫోన్ వచ్చింది కాబట్టి దాన్ని లిఫ్ట్ చేసాను దానివల్లే నా మీద కోపం గా ఉంది అని మనోజ్ అంటాడు.. చిన్న చిన్న వాటికి ఆడవాళ్ళకి కోపం ఊరికే వస్తుంది కదా అందుకే శృతి కూడా కోపం వచ్చింది అని రవి అంటాడు.. పోనీలేరా మనకు ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా వాళ్ళకి అర్థం కాదు అని బాలు నోరు తెరవగానే.. ఇప్పుడు వదిన ఎందుకు కోపంగా ఉంది నాకు బాగా అర్థమైంది అని రవి అంటాడు.

నిజాన్ని బయటపెట్టిన సత్యం..

Advertisement

ఏంట్రా ఎందుకురా మీ భార్యలతో గొడవ పడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది రా నీ సత్యం అంటాడు. అమ్మ లాగా మా భార్యలో ఉండరు నాన్న అమ్మ చాలా మంచిది అని అనగానే నా బాధ గురించి నేను ఎవరికి చెప్పుకోలేనురా అని సత్యం అంటాడు. ఏంటి మా అమ్మ అంత ఘోరంగా ఉంటుందా.. మీరు ఊరికే అనొద్దు నాన్న అమ్మ చాలా మంచిది అని అందరూ అంటారు కానీ సత్యం మాత్రం నా బాధ గురించి నేను ఎవరికి చెప్పుకోలేను అని అంటాడు.. అయితే నేను మిమ్మల్ని బాధ పెడుతున్నాను అని ప్రభావతి కూడా అడుగుతుంది. పిల్లలు ముందు ఈ వయసులో ఇలాంటివి మాట్లాడుకోవడం మంచిది కాదులే అని సత్యం అంటాడు. భోజనం అయిపోయింది నేను వెళ్తున్నాను అని సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

భార్యల బాధలతో అన్నదమ్ములు..

మనోజ్ బాలు పైకి వెళ్లి పక్క వేసుకుని పడుకోవాలని అనుకుంటారు. నువ్వు అటు సైడ్ పడుకో నేను ఇటు సైడ్ పడుకుంటా అని అంటారు అయితే మరి నేను ఎటు సైడ్ పడుకోవాలి అని రవి. అరె నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకున్నావు కదా లేచిపోయి మరి నీ పెళ్ళాంతో పెళ్లి చేసుకున్నావు కదా మరి ఎందుకు రా నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే నా బాధ మీ బాధలు కన్నా ఎక్కువ అని రవి అంటాడు.. ముగ్గురు కూడా తమ భార్యలు పెట్టిన బాధలు తలుచుకొని పెళ్లనేది నూరేళ్ల మంట అంటూ కొటేషన్లతో డైలాగులతో ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తారు.. ఇక ముగ్గురు అన్నదమ్ములు కూడా కలిసి పడుకోవాలని అనుకుంటారు.

ప్రభా పై సత్యం సీరియస్..

Advertisement

అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదండి ఇంట్లో.. ముగ్గురు కూడా ఒకేసారి గొడవపడ్డారు అంటే నాకు ఏదో భయంగా ఉంది. మీరు ఏం పట్టించుకోనట్లు ఉంటారంటే ఒకసారి ఏం జరిగిందో కనుక్కోండి అని ప్రభావతి అంటుంది. కానీ సత్యం మాత్రం భార్య భర్తల గొడవల మధ్యలోకి మనం వెళ్ళకూడదు. వాళ్ల గొడవలు నీ బాల్య పరిష్కరించుకుంటారు అని సత్యం మౌనంగా ఉంటాడు. ప్రభావతి మాత్రం అలా వదిలేస్తే వాళ్ళు ఏమైపోతారు అని అంటుంది. మరి నేను ఏమైపోయానో నీతో కాపురం చేస్తున్నాను కదా అని సత్యం అనగానే ప్రభావతి ఇంకాస్త సీరియస్ అవుతుంది. నేను రాత్రంతా ఈ గొడవలు పడుతూ ఉండలేను నేను కూడా పైకి వెళ్ళిపోతాను అని దిండు చాప తీసుకొని సత్యం కూడా పైకి వస్తాడు.

నలుగురు కలిసి ముచ్చట్లు..

పైన ఉన్న ముగ్గురికి తోడు కావాలా నాన్న వెళ్లడంతో ఏం జరిగింది అని అడుగుతాడు.. కానీ సత్యం మాత్రం మీకు జరిగింది నాకు జరిగింది అని చెప్పడంతో నలుగురు కూడా తమ భాదలని పంచుకొని బాధపడిపోతూ ఉంటారు. అయితే ఎందుకు గొడవలు జరిగాయని రాత్రి ముచ్చట్లు పెట్టుకుంటారు ఇక అదే విధంగా ఆడవాళ్లు కూడా కింద ఒకరికి ఇద్దరు ఇద్దరికీ ముగ్గురు అన్నట్లుగా దొంగచాటుగా వెళ్లి తింటూ ఉంటారు. అది చూసిన రోహిణి నన్నెందుకు పిలవలేదు అని అంటుంది దానికి స్తుతి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ వేస్తుంది. ఇక ప్రభావతి కూడా డోర్ కొట్టి లోపలికి రావడంతో నలుగురు కలిసి చాలా సంతోషంగా చిప్స్ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు.

చింతామణికి మీనా వార్నింగ్..

మీనా టీవీ యాక్టర్ కల్యాణ వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. బయట మొత్తం డెకరేషన్ చేసి కార్ ని అందంగా అలంకరిస్తూ ఉంటుంది.. అది చూసిన చింతామణి తన మనుషులని పంపించి ఆ డెకరేషన్ పీకేయాలని అనుకుంటుంది. అయితే రౌడీ ఎవర్రా మేము పంపించింది మీరు సంగతి నేను చూస్తాను అని అనడంతో ఆ రౌడీలు భయపడి పారిపోతారు. నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగితే ఒకటి అని చింతామణి ఆలోచిస్తూ ఉంటుంది. కళ్యాణ్ అక్కడికి వచ్చి మీరు డెకరేషన్ మెచ్చుకోడంతో పాటుగా ఇంకొక 5000 ఎక్స్ట్రా ఇవ్వండి అని అంటాడు. కానీ చింతామణి డెకరేషన్ కి కాస్త తగ్గించి ఇవ్వమనడంతో ఒక సరిగా షాక్ అవుతుంది.. మీ నాకు వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటుంది కానీ చింతామణికి మీనా వార్నింగ్ ఇస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో మనోజ్ సీసీటీవీ ఫుటేజ్ కోసం గుడికి వస్తాడు ఆ విషయాన్ని సుమతి మీ నాతో చెప్తుంది ఆ తర్వాత ఏమవుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: సాగర్ పై రెచ్చిపోయిన నర్మదా.. ఇదేం ట్విస్ట్ స్వామి.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Related News

Nindu Manasulu Prerana : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రేరణ అవుట్..

Podarillu Today Episode : చక్రీ మాటకు ప్రతాప్ మైండ్ బ్లాక్.. మహా గదిలోకి చక్రీ.. కన్నతల్లి కోసం కన్నా కన్నీళ్లు.. ఇదే ట్విస్ట్

Karthika Deepam 2 Serial Today Episode May 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ కు సారీ చెప్పిన శివనారాయణ – షాక్ లో జ్యోత్స్న  

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ పై రెచ్చిపోయిన నర్మదా.. ఇదేం ట్విస్ట్ స్వామి.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Brahmamudi Serial Today Episode May 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు కావ్య గోల్డ్ చైన్ ఇచ్చిన ఇందు  

Intinti Ramayanam Today Episode: పల్లవికి శ్రీయా స్ట్రాంగ్ కౌంటర్.. అవని దెబ్బ అదుర్స్.. రాజేశ్వరి ఎంట్రీతో మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Pallavi : ‘ఇంటింటి రామాయణం ‘ పల్లవి భర్త ఎవరో తెలుసా..? మెంటలెక్కిపోవాల్సిందే..

Big Stories

Advertisement
×