IPL Auction 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు ( Indian Premier League 2026 Tournament )
సంబంధించిన మినీ వేలం చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. భయంకరమైన బ్యాటర్ లను తక్కువ ధరకే ఫ్రాంచైజీలు కొనుగోలు చేసి ముందుకు వెళుతున్నాయి. డబ్బులు కాపాడుకుంటూనే విధ్వంసరకర డాటర్లను తక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కామెరాన్ గ్రీన్ మినహా మిగిలిన ప్లేయర్లందరూ తక్కువ ధర పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడుక్వింటన్ డికాక్ కేవలం కోటి రూపాయలు మాత్రమే పలికాడు. అతని చాలా తెలివిగా ముంబై ఇండియన్స్ కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. దీంతో రోహిత్ శర్మకు మరో ఓపెనర్ జోడిగా క్వింటన్ డికాక్
చాలా బాగా ఆడతాడు. వాళ్ళిద్దరూ కలిస్తే ముంబై ఇండియన్స్ ను ఆపడం ఎవరి తరం కాదు. రోహిత్ శర్మకు జోడిగా మరో ఓపెనర్ లేక ముంబై ఇండియన్స్ చాలా సతమతమవుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే క్వింటన్ డికాక్ ను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్.
క్వింటన్ డికాక్ ముంబై ఇండియన్స్ జట్టులోకి రావడంతో ఆ జట్టు చాలా బలంగా తయారయింది. ఓపెనర్లుగా క్వింటన్ డికాక్ అలాగే రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నారు. వీళ్ళిద్దరి తర్వాత విల్ జాక్స్ భయంకరమైన బ్యాటింగ్ తో రెచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక టి20 స్పెషలిస్టు మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ ఐదో స్థానంలో వస్తాడు. వీళ్ళందరూ విఫలమైన హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో అదరగొడతాడు. అలాగే నమన్ ధీర్ కూడా ఆపద్బాంధవుడిలా ఆదుకుంటాడు. అంచనాలను మించి పోయేలా మిచెల్ సాంట్నర్ ఎనిమిదో స్థానంలో కూడా ఆడుతాడు.
IPL 2026 కోసం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్:
1. రోహిత్ శర్మ.
2. క్వింటన్ డి కాక్.
3. విల్ జాక్స్.
4. తిలక్ వర్మ.
5. సూర్యకుమార్ యాదవ్.
6. హార్దిక్ పాండ్యా.
7. నమన్ ధీర్.
8. మిచెల్ సాంట్నర్.
Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్కడ చూడాలంటే
MUMBAI INDIANS BATTING ORDER FOR IPL 2026:
1. Rohit Sharma.
2. Quinton De Kock.
3. Will Jacks.
4. Tilak Varma.
5. Suryakumar Yadav.
6. Hardik Pandya.
7. Naman Dhir.
8. Mitchell Santner.– MUMBAI INDIANS TOP 8..!!!!🔥 pic.twitter.com/DVxd9SqiIZ
— Tanuj (@ImTanujSingh) December 16, 2025