E-Paper
Advertisement

India vs Pakistan: జియో హాట్‌స్టార్ ను వేధిస్తోన్న‌ పాకిస్తాన్..అందుకే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ఔట్ ?

India vs Pakistan:  జియో హాట్‌స్టార్ ను వేధిస్తోన్న‌ పాకిస్తాన్..అందుకే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ఔట్ ?
Advertisement

India vs Pakistan:  టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్  ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. చాలా రోజుల నుంచి క్రికెట్ ప్రసారాలు అందజేస్తున్న జియో హాట్‌స్టార్ సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ప్రసారాలు అందించబోమంటూ ఐసీసీకి తాజాగా వెల్లడించిందట జియో హాట్‌స్టార్. కారణం చెప్పలేదు కానీ, 2027 వరకు కొనసాగలేమని, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని బ్రేక్ చేసిందట‌ జియో హాట్ స్టార్ ( Jio Hotstar). ఇక అర్ధాంతరంగా జియో హాట్‌స్టార్ తప్పుకోవడంతో ఐసీసీ గందరగోళంలో పడింది. మ‌ధ్య త‌ప్పుకుంటే, మ‌రో ఓటీటీ సంస్థ ఎలా వ‌స్తుంద‌ని ఐసీసీ ఆలోచ‌న‌లో ప‌డింద‌ట‌.

Also Read: Ind vs Sa 3rd Odi: స్టెప్ క్యాచ్ ప‌ట్టి, రివ్యూ తీసుకున్న కేఎల్ రాహుల్‌.. కోహ్లీ రియాక్ష‌న్ చూడండి, న‌వ్వుకోవాల్సిందే

పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ కారణం అంటూ వార్తలు

Advertisement

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు ( T20 World Cup 2026 tournament ) ప్రసార హక్కుల నుంచి వైదొలగాలని జియో హాట్‌స్టార్ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా అర్ధాంతరంగా జియో హాట్‌స్టార్ తప్పుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కొలంబోలో నిర్వహించడం పట్ల జియో హాట్‌స్టార్ అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య మ్యాచ్ కొలంబో వేదిక‌గా జ‌రిగితే, వ్యూయ‌ర్ షిప్ రాద‌ని జియో హాట్‌స్టార్ ఆలోచ‌న చేస్తోంద‌ట‌. శ్రీలంకతో పాటు భారత్ ఆథిధ్యం ఇస్తున్న నేపథ్యంలో, బీసీసీఐకి హైపవర్స్ ఉంటాయి.

కాబట్టి ఆ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మ్యాచ్ ను కొలంబోలో కాకుండా ఇండియా లేదా ఇత‌ర త‌ట‌స్థ వేదిక‌ల్లో నిర్వహించాల్సింది అంటూ జియో హాట్‌స్టార్ అభిప్రాయపడుతోందట. ఈ మ్యాచ్ కొలంబో వేదికగా నిర్వహిస్తున్నందుకు గానే జియో హాట్‌స్టార్ తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొలంబో వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే వ్యూయర్షిప్ తగ్గిపోతుందని చెబుతోందట జియో హాట్ స్టార్. దాని వల్ల త‌మకు ఒరిగేది ఏమీ లేదని అంటోంద‌ట‌.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంద‌ట‌ జియో హాట్‌స్టార్. మ‌రి ఇందులో ఎంత మేర‌కు వాస్త‌వం ఉందో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా టీ20 ప్రపంచ కప్‌ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు కొనసాగనుంది. దాదాపు నెల రోజులపాటు ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. అయితే పాకిస్తాన్ తో పాటు ఇండియా ఒకే గ్రూప్ లో ఉండడంతో ఈ రెండు దాంట్లో మధ్య ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ ఉండనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో జియో హాట్ స్టార్‌ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.

Also Read: DK Shivakumar: ఆర్సీబీ ఫ్యాన్స్ కు ట్ర‌బుల్ షూట‌ర్‌ గుడ్ న్యూస్‌..చిన్న‌స్వామికి ఎలాంటి ఢోకా లేదు, ఇక పండ‌గే

 

 

Related News

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

Big Stories

Advertisement
×