Womens World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ ని తొలిసారి గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టులోని కీలక సభ్యురాలికి భారీ నజరానా లభించింది. ఈ మెగా టోర్నమెంట్ లో తన అద్భుతమైన బౌలింగ్ తో భారత్ ప్రపంచ కప్ గెలుచుకునేలా చేసింది. ఆమె మరెవరో కాదు క్రాంతి గౌడ్. మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియదు. కానీ మహిళల జట్టు వరల్డ్ కప్ లో టైటిల్ గెలిచిన తర్వాత ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది.
Also Read: PM Modi: వరల్డ్ కప్ విజేతలకు PM మోడీ బంపర్ ఆఫర్.. డైమండ్ నెక్లెస్‌ల బహుమతి!
వేసుకోవడానికి కాళ్లకు చెప్పులు కూడా లేని కటిక పేదరికం, 8వ తరగతిలోనే చదువుకి పుల్ స్టాప్.. ఇలా ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని 22 ఏళ్లకే భారత మహిళా క్రికెట్ జట్టులో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించింది. బాల్యం నుండి తాను పెరిగిన కష్టాలను కసిగా మలుచుకొని తక్కువ సమయంలోనే భారత జట్టులో ప్రధాన బౌలర్ గా ఎదిగింది. ఇక భారత్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా విశ్వ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించింది.
మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో తన అద్భుత బౌలింగ్ తో రాణించిన మధ్యప్రదేశ్ కి చెందిన ఈ యువ పేసర్ క్రాంతి గౌడ్ కి మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 1 కోటి నగదు బహుమతిగా ప్రకటించింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోమవారం స్వయంగా వెల్లడించారు. “ఆదివారం రోజు రాత్రి మన అమ్మాయిలు క్రికెట్ లో అద్భుతాలు చేశారు. దేశం మొత్తం గర్వపడేలా చేశారు. ఈ విజేత జట్టులో మన మధ్యప్రదేశ్ బిడ్డ క్రాంతి గౌడ్ కూడా ఉండడం మనకు గర్వకారణం. ఆమె అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోటి రూపాయల బహుమతిని ప్రకటిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నట్లే.. క్రీడల్లో మహిళలు కూడా సత్తా చాటుతున్నారు” అని కొనియాడారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి.
ఈ ఏడాది మార్చ్ లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో న్యూజిలాండ్ ని చిత్తు చేసిన భారత జట్టు మూడవసారి కప్ ని సొంతం చేసుకుంది. ఈ జట్టులో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నారు. అయితే కప్ అందుకున్న భారత క్రికెటర్లు చేసిన సంబరాలు ఆకాశాన్నంటాయి. టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీతో ఎన్నో ఫోటోలు దిగారు.
Also Read: SRH -IPL 2026: హైదరాబాద్ ఫ్యాన్స్ కు షాక్… కాటేరమ్మ కొడుకును గెంటేస్తున్న కావ్య పాప ?
కానీ హార్దిక్ పాండ్యా ట్రోఫీని తీసుకుని పిచ్ పైకి వెళ్లి.. ఆ ట్రోఫీని భూమిపై ఉంచి ఐకానిక్ స్టైల్ లో ఓ ఫోజ్ ఇచ్చాడు. ఈ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫోటో కేవలం 6 నిమిషాలలోనే 1 మిలియన్ లైక్స్ సాధించింది. అచ్చం ఇలాగే క్రాంతి గౌడ్ కూడా మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన అనంతరం ఆ కప్ తో హార్దిక్ పాండ్యా లాగా పోజ్ ఇచ్చింది. హార్దిక్ పాండ్యా సెలబ్రేషన్ స్టైల్ ని తీసుకొని.. అచ్చం అతడిలాగే పోజ్ ఇవ్వడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kranti Goud re-created Hardik Pandya's celebration. 🥺❤️ pic.twitter.com/e7dVeLxt5j
— Johns. (@CricCrazyJohns) November 4, 2025