Kevin Pietersen: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఇతడికి భారత జట్టుతో కూడా మంచి అనుబంధం ఉంది. తన కెరీర్ లో ఇప్పటివరకు 104 టెస్ట్ లు ఆడిన కెవిన్ 8 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు ఉన్నాయి. అలాగే 136 వన్డేలు ఆడిన కెవిన్.. 40.73 సగటుతో 4,440 పరుగులు చేశాడు.
Also Read: Rishabh Pant: గాయం అంటూ రిషబ్ పంత్ నాటకాలు… టీ20 వరల్డ్ కప్ విజయం వెనుక రహస్యం
ఇక అంతర్జాతీయ టి-20 ల్లోనూ రాణించాడు. టి-20 ల్లో మొత్తం 37 మ్యాచ్ లు ఆడిన కెవిన్ పీటర్సన్.. 1,176 పరుగులు చేశాడు. 2018లో తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన కెవిన్.. ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, పూణే ఫ్రాంచైజీలతో కలిసి 36 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి.. 1001 పరుగులు చేశాడు.
ఇక కెవిన్ పీటర్సన్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. అతడి భార్య పేరు జెస్సికా టేలర్. ఆమె ఒక మాజీ లిబర్టీ మరియు గాయని. కెవిన్ పీటర్సన్ – జెస్సికా 2007 డిసెంబర్ 29న విల్ట్ షైర్ లోని కాజిల్ కాంబ్ చర్చ్ లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగి దాదాపు 18 సంవత్సరాలు కావస్తోంది. కానీ ఇప్పుడు కెవిన్ పీటర్సన్ తన భార్యకు తెలియకుండా ఇలా చేస్తున్నాడంటూ ఓ సంచలన రూమర్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కెవిన్ పీటర్సన్ ఓ హీరోయిన్ తో సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడని.. సోషల్ మీడియాలో ఆ హీరోయిన్ ని ఫాలో అవుతూ, ఆమె పోస్ట్ లకి లైక్ లు కొడుతూ దొరికిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు మిల్లీ బాబి. తాజాగా బ్రిటిష్ కి చెందిన ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోకి లైక్ కొట్టాడు కెవిన్ పీటర్సన్. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్ట్రేంజర్ థింగ్స్ అనే ఓ వెబ్ సిరీస్ తో ఎంతో పాపులారిటీ సంపాదించింది ఈ హలీవుడ్ నటి.
ఈ మూవీతో పాటు పలు సినిమాలు, ఇతర సిరీస్ లు కూడా చేసింది. ఈమె వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఈమెతో ప్రస్తుతం కెవిన్ రిలేషన్ లో ఉన్నారంటూ చేస్తున్న ప్రచారంపై కెవిన్ అభిమానులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ రూమర్స్ పై కెవిన్ స్పందిస్తాడా..? లేదా..? అన్నది వేచి చూడాలి. మరోవైపు మిల్లి బాబీకి గతేడాది మే నెలలోనే వివాహం జరిగింది. తన 22 ఏళ్ల ప్రియుడుతో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. కోనేళ్ల నుండి మోడల్ జేక్ బొంగివోయ్ తో రిలేషన్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. 2024 మే నెలలో అతడిని వివాహం చేసుకుంది.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 28, 2025