The Great khali : మాజీ ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్.. WWE హాల్ ఆఫ్ ఫేమర్, ది గ్రేట్ ఖలీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య ఆయన ఎక్కడికి వెళ్లినా.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహాకుంబ్ లో పాల్గొన్నారు. అభిమానులు అతనితో ఫొటోలు దిగడానికి ఆ సమయంలో తీవ్రంగా ప్రయత్నించారు. కొంత మందితో సెల్పీలు, ఫోటోలు దిగారు. మరికొందరూ కూడా తమతో దిగాలని కోరడంతో ఇంత మందితో ఎలా దిగుతారని వారితో వివాదం తలెత్తింది. తాజాగా ఓ విమానంలో ది గ్రేట్ ఖలీ గురించి ఓ వీడియో వైరల్ అవుతోంది. విమానంలో సీటు బెల్ట్ పెట్టుకునేందుకు ఖలీ కష్టాలు పడ్డాడు. ఇలాంటి కష్టాలు పగవాడికి కూడా రావద్దు అని.. ఇది ఎయిర్ ఇండియా పనే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం విశేషం.
Also Read : Rinku Singh : 9వ తరగతి ఫెయిల్.. ఇంగ్లీష్ రాదు బొంగు రాదు.. రింకూ సింగ్ పై దారుణంగా ట్రోలింగ్ !
విమానంలో ఖలీ కష్టాలు.. దారుణంగా ట్రోలింగ్స్..
వాస్తవానికి ఖలీ విమానంలో వెళ్తున్న సమయంలో సీటు బెల్ట్ పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆ బెల్ట్ మాత్రం అస్సలు పట్టడం లేదు. వాస్తవానికి అతను ఏ కంపెనీకి సంబంధించిన విమానంలో వెళ్తున్నాడో మాత్రం తెలియదు. కానీ నెటిజన్లు మాత్రం ఎయిర్ ఇండియా విమానంలోనే వెళ్తున్నట్టు ట్రోలింగ్స్ చేస్తున్నారు. మొన్న ఎయిర్ ఇండియా విమానానికి అహ్మదాబాద్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఖలీ కి ఎయిర్ ఇండియా విమానంలో సీటు బెల్ట్ కూడా పట్టడం లేదని.. అలాంటి మరో ఎయిర్ ఇండియా విమానం ఎక్కడా అని ట్రోలింగ్స్ చేయడం గమనార్హం. వాస్తవానికి ది గ్రేట్ ఖలీ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా విమానంలో సీట్ బెల్ట్ పెట్టుకుంటూ వార్తల్లో నిలిచాడు.
ఖలీ సీట్ బెల్ట్ వీడియో వైరల్
ఇక గతంలో చాలా సందర్భాల్లో అతని పై నెగిటివ్ కామెంట్స్ చేసారు. ఇటీవల ఓ టోల్ బూత్ ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే టోల్ ప్రాజా ఉద్యోగులతో ఖలీ గొడవ పడుతున్న వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఐడీ కార్డు అడిగినందుకు టోల్ ప్లాజా ఉద్యోగిని ఖలీ చెప్పుతో కొట్టినట్టు ప్రచారం జరిగింది. ఖలీ మాత్రం అప్పుడు టోల్ ప్లాజా ఉద్యోగులు తనను బ్లాక్ మెయిల్ చేశారని పేర్కొనడం గమనార్హం. ఫొటోలు తీయడానికి టోల్ ప్లాజా ఉద్యోగి ఒకరు కారులోకి వచ్చాడని.. దీంతో తాను నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. ఆ తరువాత మిగిలిన ఉద్యోగులు వచ్చి తన కారును చుట్టిముట్టి బ్లాక్ మెయిల్ చేశారని ఖలీ చెప్పుకొచ్చాడు. మరో వైపు ఈ ఘర్షణలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల మహాకుంభ మేళా సమయంలో కూడా తనతో సెల్ఫీ, ఫొటోలు దిగడానికి ప్రయత్నించిన వారితో స్వల్ప వాగ్వాదం పెట్టుకున్నాడు ఖలీ. ప్రస్తుతం ఖలీకి సంబంధించిన విమానం సీట్ బెల్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
?igsh=MWZsc3A2OGlyNDhtaA==