BigTV English

Rishabh Pant: గాయం అంటూ రిషబ్ పంత్ నాటకాలు… టీ20 వరల్డ్ కప్ విజయం వెనుక రహస్యం

Rishabh Pant: గాయం అంటూ రిషబ్ పంత్ నాటకాలు… టీ20 వరల్డ్ కప్ విజయం వెనుక రహస్యం

Rishabh Pant: టీమిండియా.. సరిగ్గా ఏడాది కిందట… ఛాంపియన్ గా నిలిచింది. 2024 టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ను గెలుచుకుంది టీమిండియా. సరిగ్గా జూన్ 29, 2024 అంటే ఏడాది కిందట.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టి20 ప్రపంచ కప్ ఛాంపియన్ గా టీం ఇండియా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో 2007 సంవత్సరంలో మొదటిసారి ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. మళ్లీ టీమిండియా చాంపియన్ గా నిలవడానికి దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది.


Also Read: Team India: ప్రభాస్ హీరోయిన్ తో డేటింగ్‌ టీమిండియా ప్లేయర్ డేటింగ్…ఆ హోటల్ కు వెళ్లి మరీ !

రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరల్డ్ కప్


రోహిత్ శర్మ కెప్టెన్సీ లోనే టి20 ప్రపంచ కప్ గెలిచింది టీమిండియా. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియాలో విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ , మహమ్మద్ సిరాజు, సూర్య కుమార్ యాదవ్ లాంటి ప్రమాదకరమైన ఆటగాళ్లు కూడా ఉన్నారు. టీమిండియాలోని బౌలర్లు, ఆల్రౌండర్లు, హిట్టర్స్ ఇలా అందరూ రాణించడంతో సౌత్ ఆఫ్రికా జట్టుపై ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా గెలిచింది. అయితే టీమిండియా ఇంత సులువుగా ఫైనల్ మ్యాచ్ లో గెలవడానికి వెనుక.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కుట్రలు ఉన్నాయి.

రిషబ్ పంత్ గాయం అంటూ నాటకాలు

బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో ఏడుపుల తేడాతో టీమిండియా విజయం సాధించి ఛాంపియన్ అయింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్నిత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 176 పరుగులు మాత్రమే చేసింది. అయితే లక్ష్యం చిన్నది కావడంతో సౌత్ఆఫ్రికా ఆటగాళ్లు కూడా.. దుమ్ము లేపారు. మ్యాచ్ గెలుస్తుందని.. అనుకునే లోపు ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా. అయితే అలా ఓడిపోవడం వెనుక రిషబ్ పంత్ గేమ్ ప్లాన్ ఉంది. 30 బంతుల్లో 30 పరుగులు చేస్తే సౌత్ ఆఫ్రికా విజయం సాధిస్తుంది.

ఆ సమయంలో సౌత్ఆఫ్రికా డేంజర్ ఆటగాడు క్లాసెన్ బ్యాటింగ్ లో ఉన్నాడు. అప్పటికే డ్రింక్స్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత గాయమంటూ రిషబ్ పంత్… నాటకాలు ఆడాడు. అలా టైం వేస్ట్ అయింది. దీంతో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ల ఊపు కాస్త తగ్గింది. కసి మీద ఉన్న సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు కాస్త చల్లబడ్డారు. ఆ తర్వాత మ్యాచ్ ప్రారంభం కాగానే.. వరుసగా వికెట్లు కోల్పోయింది సౌత్ ఆఫ్రికా. చివరికి టీమిండియా గెలిచింది. సూర్య కుమార్ అద్భుతమైన క్యాచ్ తో మ్యాచ్ మొత్తం మలుపు తిరిగింది. అలా.. సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ల రిధం ను డైవర్ట్ చేశాడు రిషబ్ పంత్.

Also Read: Morkel vs Arshdeep : గ్రౌండ్ లోనే WWE ఆడుతున్న ప్లేయర్లు.. మోర్కల్ పై అర్ష్ దీప్ దాడి.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా విజయం సాధించింది. అయితే టీం ఇండియా ఛాంపియన్ సంవత్సరం దాటిన నేపథ్యంలో… ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే గాయమంటూ ఆడిన పంత్ ఫోటో కూడా వైరల్ అయింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో కూడా పంత్ పంచుకున్నాడు. దీంతో.. ఆ ఫోటో పై క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు. రిషబ్ పంత్ లేకపోతే టీమిండియా గెలిచేది కాదని అంటున్నారు.

Related News

Samantha: సమంతకు దగ్గరైన టీమిండియా ప్లేయర్.. షాకింగ్ పోస్ట్ వైరల్ !

Nayanthara: ‘నయన్’ ఎ**ఫైర్ లిస్ట్ పెద్దదే..లిస్ట్ లో టీమిండియా సీనియర్ ఆటగాడు ?

WWE Ric Flair: 76 ఏళ్ల వయసులో ఇద్దరు లేడీలతో రొమాన్స్ చేస్తున్న మల్లయోధుడు

Kohli – Anushka: లండన్ వీధుల్లో కోహ్లీ-అనుష్కకు షాక్… ఎవరు పట్టించుకోవడం లేదుగా !

Rinku Singh: రింకు సింగ్ కు దరిద్రంగా మారిన ఆ లేడీ…టీమిండియాలో ఛాన్స్ దక్కడం కష్టమేనా ?

Adam Hose: క్రికెట్ లోనే తొలిసారి.. గ్రౌండ్ లో భయంకరమైన గాయం.. కాలు విరిగి.. వీడియో చూస్తే వణికి పోవాల్సిందే

Big Stories

×