Kohli – KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. అనవసరంగా కర్ణాటక ప్రజల సంస్కృతిపై… విషం చిమ్ముతూ… అడ్డంగా దొరికిపోయాడు విరాట్ కోహ్లీ. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ ను ట్రోలింగ్ చేయబోయి… కర్ణాటక సంస్కృతిని అవమానపరిచాడు విరాట్ కోహ్లీ. కాంతారా సెలబ్రేషన్స్ ను అవమానించేలా వ్యవహరించాడు విరాట్ కోహ్లీ. దీంతో విరాట్ కోహ్లీ పైన ఇప్పుడు సోషల్ మీడియాలో కర్ణాటక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి విరాట్ కోహ్లీని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Rishabh Pant : రిషభ్ పంత్ పై దారుణంగా ట్రోలింగ్.. నువ్వు ఎందుకు ఆడుతున్నావు అంటూ
కేఎల్ రాహుల్ ను అవమానించిన విరాట్ కోహ్లీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఆదివారం రోజున.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన అధికారం తీర్చుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ సీజన్లో మొదటిసారి బెంగళూరు గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అయితే.. ఆదివారం మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన ఢిల్లీ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఇలా ఢిల్లీ పైన బెంగళూరు ప్రతీకారం తీర్చుకున్నట్లఅయింది.
ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కారణంగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. మ్యాచ్ పూర్తయిన తర్వాత… కాంతార స్టైల్ లో సెలబ్రేట్ చేసుకుంటూ కేఎల్ రాహుల్ను ట్రోలింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ బెంగళూరులో విజయం సాధించినప్పుడు… కాంతార సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే తాజాగా… కేఎల్ రాహుల్ ను ఇన్సల్ట్ చేస్తూ…. విరాట్ కోహ్లీ అదే సెలబ్రేషన్స్ మళ్లీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విరాట్ కోహ్లీ పై కర్ణాటక ప్రజల ఆగ్రహం ?
కేఎల్ రాహుల్, కాంతార సెలబ్రేషన్స్ ను ట్రోలింగ్ చేయడంపై విరాట్ కోహ్లీని టార్గెట్ చేశారు కర్ణాటక ప్రజలు. బెంగళూరుకు చెందిన కేఎల్ రాహుల్ ను… ఉద్దేశించి కోహ్లీ టార్గెట్ చేయడంతో… కర్ణాటక ప్రజలకు అసలు నచ్చడం లేదు. ఎంత కాదనుకున్న కేఎల్ రాహుల్ తమవాడని… అలాంటి రాహుల్ను ఇబ్బంది పెట్టడం తగదు అంటూ కోహ్లీ పై ఫైర్ అవుతున్నారు కర్ణాటక ప్రజలు. అలాగే కాంతార సెలబ్రేషన్స్ అనేవి కర్ణాటక కు సంబంధించిన సంస్కృతిక కార్యక్రమం. తమ సంప్రదాయాలను విరాట్ కోహ్లీ.. గౌరవించడం లేదని మండిపడుతున్నారు మరి కొంతమంది. వెంటనే విరాట్ కోహ్లీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
Also Read: IPL 2025: పాయింట్స్ టేబుల్ లో RCB టాప్… Orange, Purple Cap కూడా
Kohli mocking Kl Rahul about his celebration 😭😭 pic.twitter.com/7h4mPsJ65A
— Ayush. (@OneKohli) April 27, 2025