Cooler Bad Smell: సమ్మర్ వచ్చేసింది. ఎండలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ఇళ్లల్లో కూలర్లు లేదా ఏసీల వాడకం చాలా వరకు పెరిగింది. వేసవి కాలంలో ఉపశమనం పొందడానికి కూలర్ మంచి ఎంపిక. కానీ కూలర్ వాడుతున్నప్పుడు కొన్ని సార్లు చల్లని గాలితో పాటు దుర్వాసన రావడం జరుగుతుంది. ఈ వాసన మొత్తం గది వాతావరణాన్ని కూడా పాడు చేస్తుంది. మీ కూలర్ నుండి కూడా ఇలాగే బ్యాడ్ స్మెల్ వస్తుంటే.. భయపడాల్సిన అవసరం లేదు. కూలర్ నుండి వచ్చే దుర్వాసనను క్షణాల్లోనే తొలగించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కూలర్ నుండి బ్యాడ్ స్మెల్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. దీనికి ప్రధాన కారణం కూలర్ యొక్క వాటర్ ట్యాంక్ . అంతే కాకుండా కూలింగ్ ప్యాడ్లలో (గడ్డి లేదా తేనెగూడు) మురికి, బ్యాక్టీరియా, ఫంగస్ పేరుకుపోవడం. నీటిని ఎక్కువ రోజులు మార్చకపోవడం లేదా ట్యాంక్ శుభ్రం చేయకపోవడం వల్ల కూలర్ లోని తేమ కారణంగా చెడు వాసన వస్తుంది. ఇదే కాకుండా.. కూలర్‌లో మురికి నీటిని ఉపయోగిస్తే కూడా చెడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది.
చిట్కాలు:
మీ కూలర్ నుండి చెడు వాసన వస్తుంటే మాత్రం ముందుగా కూలర్‌లోని గడ్డి, మురికిని శుభ్రం చేయండి. కూలింగ్ ప్యాడ్ లలో మురికి, బ్యాక్టీరియా లేదా ఫంగస్ కనిపిస్తే వాటిని పూర్తిగా శుభ్రం చేయండి. అలాగే.. కూలర్‌లోని నీటిని చాలా కాలంగా మార్చకపోతే.. వెంటనే మార్చండి.
తర్వాత కూలింగ్ ప్యాడ్‌లు లేదా కూలర్ శుభ్రం చేసిన తర్వాత కూడా దుర్వాసన వస్తుంటే.. మీరు 2-3 నిమ్మకాయను కూడా కూలర్ నుండి వాసన తొలగించేందుకు ఉపయోగించవచ్చు.
Also Read: చీటికీ మాటికీ పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
నిమ్మకాయ అద్భుతాలు చేస్తుంది:
నిమ్మకాయ ఒక సహజ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్ . ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ బ్యాక్టీరియా , ఫంగస్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా నిమ్మకాయ యొక్క తాజా వాసన కూలర్ నుండి వచ్చే దుర్వాసనను తొలగిస్తుంది. అంతే కాకుండా గాలిని తాజాగా చేస్తుంది.
చాలా సార్లు.. కూలింగ్ ప్యాడ్లలో కూడా బ్యాక్టీరియా , ఫంగస్ పేరుకుపోతాయి. ఇవి కంటికి కనిపించవు, దీని కారణంగా కూలర్ దుర్వాసన వస్తుంది. ఇలాంటి సమయంలో మీరు మీ కూలర్‌లోని నీటిలో కాస్త నిమ్మరసం వేస్తే.. కూలర్ నుండి వచ్చే వాసన కొన్ని గంటల్లోనే ఆగిపోతుంది.
వెనిగర్ , బేకింగ్ సోడా వేసి ప్రతి వారం కూలర్ ట్యాంక్‌ను ఖచ్చితంగా కడగండి. కూలర్ నీటిలో కొద్దిగా డేటోల్ (Dettol) వేసి శుభ్రం చేయండి. ఇది బ్యాక్టీరియా, శిలీంధ్రాల్ని నాశనం చేస్తుంది. అంతే కాకుండా కూలర్ నీటిలో 1 కప్పు వెనిగర్ లేదా నిమ్మరసం కలిపితే సహజమైన ఫ్రెష్‌నెస్ వస్తుంది. మార్కెట్‌లో స్పెషల్‌గా కూలర్ ఫ్రెష్‌నర్స్ సులభంగా దొరుకుతాయి. వాటిని కూడా మీరు ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలు పాటిస్తే మీ కూలర్ నుంచి వచ్చే చెడు వాసన తగ్గిపోతుంది.