BigTV English

Hantavirus: వామ్మో.. ఎలుకల వైరస్, ఇప్పటికే ఇద్దరు మృతి.. లక్షణాలు ఇవే

Hantavirus: వామ్మో.. ఎలుకల వైరస్, ఇప్పటికే ఇద్దరు మృతి.. లక్షణాలు ఇవే

Hantavirus: అమెరికాలోని కాలిఫోర్నియాలో హంటవైరస్‌ కలకలం రేగింది. రోడ్రిగో బెసెర్రా(26) అనే యువకుడు హంటవైరస్ పల్మనరీ సిండ్రోమ్ అనే అరుదైన ఎలుకల వ్యాధితో మరణించాడని అక్కడి అధికారులు తెలిపారు. గతంలో ఈ వ్యాధి కారణంగానే ప్రముఖ నటుడు జీన్ హ్యాక్‌మన్ భార్య పియానిస్ట్ బెట్సీ అరకావా కూడా ప్రాణాలు కోల్పోయారు. హంటవైరస్ సాధారణంగా ఎలుకల మూత్రం, లాలాజలం, మలం ద్వారా మనుషులకు సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధి వ్యక్తి నుండి వ్యక్తికి సోకదు. ప్రధానంగా ఎలుకల నుంచి వచ్చే వ్యర్థాల ద్వారా వస్తుందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే ఎలుక కాటు లేదా గీతల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందట.


అయితే, ఈ వైరస్ కారణంగానే బెసెర్రా మృతి చెందాడనే విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 6న మామత్ లేక్స్‌లోని తన ఇంట్లో బెసెర్రా మరణించినట్లు అధికారులు తెలిపారు. అతను రెండు వారాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. యాంటీబయోటిక్స్ తీసుకున్నప్పటికీ కోలుకోలేదని అన్నారు.

అయితే, రెండు వారాలు ఆనారోగ్యంతో బాధ పడుతున్న బెపెర్రాను ఆసుపత్రికి తరలించామని అతని సోదని మరియెలా తెలిపారు. కానీ, అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. మరుసటి రోజే అతను చనిపోయాడని వాపోయారు. ఎలుకల కారణంగానే బెసెర్రా చనిపోయాడని చెప్తే డాక్టర్లు కూడా తోసిపుచ్చారని అమె ఆరోపించారు. నిజాన్ని దాచేందుకు ప్రయత్నించినంత మాత్రాన అది నిజంకాకుండా పోదని అన్నారు. ఇప్పటికైనా హంటవైరస్ గురించి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు డాక్టర్లు ప్రయత్నించాలని మరియెలా సూచించారు.


జీన్ హ్యాక్‌మన్ భార్య బెట్సీ అరకావా కూడా హంటవైరస్ కారణంగానే చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూ మెక్సికోలోని తన ఇంట్లో బెట్సీ ఈ వ్యాధితోనే మృతిచెందిందని అధికారులు నిర్దారించారు.

బెసెర్రా మామత్ మౌంటైన్ ఇన్‌లో బెల్‌హాప్‌గా పనిచేసేవాడు. అక్కడ ఫ్రంట్ డెస్క్ దగ్గర ఎలుకల వ్యర్థాలు కనిపించినట్లు తెలిసింది. వీటి నుంచి వైరస్ సోకడం వల్లే బెసెర్రా మృతిచెంది ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఆ ఏరియాలో పని చేసే వారు భయపడాల్సిన అవసరం లేదని మామత్ మౌంటైన్ ఇన్ హెల్త్ డైరెక్టర్ డేవిడ్ ఆండ్రూస్ తెలిపారు. అలాంగే బెసెర్రా ఉంటున్న ఇంట్లో కూడా ఎలుకలు లేవని తెలిపారు.

Related News

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Big Stories

×