Rishabh Pant : ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మరో ఓటమిని చవిచూసింది.ఇక ఈ సీజన్ లో ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడితే వాటిలో 5 మ్యాచ్ ల్లో గెలిచి.. మరో 5 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది లక్నో. కెప్టెన్ రిషబ్ పంత్ విఫలం చెందడంతోనే లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా ఓడిపోతుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పంత్.. ఈ సీజన్ విఫలం చెందుతున్నాడు.
Also Read : Digvesh Rathi: వీడు మారడు.. మరోసారి దిగ్వేశ్ ‘నోట్‌బుక్’ సంబరాలు.. వేటు తప్పదా !
ఇవాళ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ కేవలం 4 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. విల్ జాక్స్ బౌలింగ్ లో కర్ణ్ శర్మ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. పంత్ ఈ సీజన్ లో మొత్తం 9 ఇన్నింగ్స్ లు ఆడితే.. వాటిలో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా మ్యాచ్ లలో 0, 15, 02, 02, 21, 3, 0, 4 స్కోర్లు చేశాడు. రూ.27కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే.. ఇలాంటి చెత్త ప్రదర్శన చేస్తారా..? అని పంత్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పంత్ రూ.27 కోట్లు పెట్టగా.. ఒక జట్టు ఐపీఎల్ సీజన్‌లో కనీసం 14 మ్యాచ్‌లు ఆడుతుంది. దీని ప్రాతిపదికన పంత్ మ్యాచ్ ఫీజు దాదాపు రూ. 2 కోట్లు. అంటే అతడి సంపాదన రూ. 2 కోట్లు. ఇవాళ రెండు బంతులకు 2 కోట్లు అంటే.. బంతికి ఒక కోటీ తీసుకుంటున్నమాట.
మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ 7 స్థానంలో బ్యాటింగ్ కి రావడం గమనార్హం. అతను ఫామ్ లో లేకపోవడంతో కెప్టెన్ అయినప్పటికీ 7 వస్థానంలో బ్యాటింగ్ కి వచ్చాడు. కానీ ఇవాళ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ 4వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి మొదటి బంతికి 4 పరుగులు చేసి.. రెండో బంతికే ఔట్ కావడం గమనార్హం. దీంతో పంత్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఈ సీజన్ చెత్త ప్రదర్శన చేసే ఆటగాళ్లందరి ఫొటోలు పెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా రిషబ్ పంత్, మ్యాక్స్ వెల్ తదితర క్రికెటర్ల ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 215 పరుగులు చేయగా.. లక్నో జట్టు 161 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ జట్టు 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ముంబై బౌలర్లలో బుమ్రా 4, బౌల్ట్ 3 వికెట్లు తీశారు. ఇక విల్ జాక్స్ 2, బోస్ 1 వికెట్ తీయడంతో 20 ఓవర్లకు కేవలం 161 పరుగులు మాత్రమే చేయగలిగింది లక్నో సూపర్ జెయింట్స్. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అందరూ రిషబ్ పంత్ గురించే చర్చించుకోవడం విశేషం. ముఖ్యంగా టుక్ టుక్ అకాడమీ చైర్మన్ అని.. రిషబ్ పంత్ వ్యాల్యూ 2700 అని.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.