BigTV English

IPL 2025: పాయింట్స్ టేబుల్ లో RCB టాప్… Orange, Purple Cap కూడా

IPL 2025: పాయింట్స్ టేబుల్ లో RCB టాప్… Orange,  Purple Cap కూడా

IPL 2025:  ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దుమ్ము లేపుతోంది. గతంలో కంటే ఈసారి టోర్నమెంట్లో… అద్భుతంగా రాణిస్తూ ముందుకు వెళ్తోంది. ఆదివారం రోజున ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన ఆరు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ విజయంతో.. పాయింట్లు పట్టికలో నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.


Also Read: Rishabh Pant : రిషభ్ పంత్ పై దారుణంగా ట్రోలింగ్.. నువ్వు ఎందుకు ఆడుతున్నావు అంటూ

పాయింట్లు పట్టికలో బెంగళూరు నెంబర్ వన్


ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన రాయల్ చాలెంజర్ బెంగళూరు విజయంతో సాధించడంతో పాయింట్లు పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన నేపథ్యంలో 14 పాయింట్లు సాధించిన బెంగుళూరు మొదటి స్థానానికి వెళ్లింది. ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పది మ్యాచ్లు ఆడింది.

 

ఇందులో ఏకంగా ఏడు మ్యాచ్లలో విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB TEAM ) మూడు మ్యాచ్లలో ఓడిపోయింది. 14 పాయింట్లు ఎవరు సాధించకపోవడంతో బెంగళూరు నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్లింది. అయితే రాయల్ చాలెంజ్ బెంగుళూరు జట్టు చేతిలో ఓడిపోయిన… ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో స్థానానికి పడిపోయింది. అలాగే రెండో స్థానంలో గుజరాత్ టైటాన్స్ 12 పాయింట్లతో నిలిచింది. పాయింట్ల పట్టికలో చివరన చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ మొన్న చెన్నై పైన… విజయం సాధించడంతో ఎనిమిదవ స్థానానికి చేరుకుంది.

పర్పుల్, ఆరెంజ్ క్యాప్ అందుకున్న బెంగళూరు ఆటగాళ్లు

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 443 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ… ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్నాడు. అలాగే బెంగళూరు ప్లేయర్ జోష్ హేజిల్ వుడ్ పర్పల్ క్యాప్ అందుకున్నాడు. ఇప్పటివరకు 18 వికెట్లు సాధించిన హేజిల్ వుడ్.. ఈ క్యాప్ అందుకోవడం జరిగింది. అతని తర్వాత ప్రసిద్ధి కృష్ణ 16 వికెట్లు, నూర్ అహ్మద్ 14 వికెట్లు, క్రూనల్ పాండ్యా 13 వికెట్లతో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో… RCB గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేదించింది.

Also Read: Sarfaraz Khan – Ananya Bangar : గే తో సర్ఫరాజ్ ఖాన్ రిలేషన్… వీడియో వైరల్

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×