E-Paper
Advertisement

Rohit – Kohli: రోహిత్ శర్మ భార్యతో కోహ్లీ రొమాంటిక్ ఫోటో..!

Rohit – Kohli: రోహిత్ శర్మ భార్యతో కోహ్లీ రొమాంటిక్ ఫోటో..!

Rohit – Kohli: విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మ.. భారత క్రికెట్ లో దిగ్గజాలు. దాదాపు ఒకేసారి తమ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన వీరిద్దరూ.. ఎన్నో ఏళ్లుగా టీమిండియాకు కీలక ఆటగాళ్లుగా నిలబడుతున్నారు. ఇటీవలి కాలంలో వీరిద్దరూ కలిసి టి-20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్ కి అందించారు. ఎన్నోసార్లు టోర్నీలు గెలిపించారు. వీరిద్దరూ భారత జట్టుకు పిల్లర్ల లాంటివారు.

Also Read: Rohit Sharma: తెలుగు ఫ్యాన్స్ అరాచ‌కం… బాల‌య్య రేంజ్ లో కోపంతో ఊగిపోయిన రోహిత్ శ‌ర్మ !

ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది పోల్చలేము. ఎవరి ఆట తీరు వారిదే, ఎవరి గణాంకాలు వారివే. కోహ్లీ లాగా రోహిత్ శర్మ సెంచరీలు చేయకపోవడం ఎలాగో.. రోహిత్ శర్మ లాగా సిక్స్ లు, డబుల్ సెంచరీల విషయంలో కోహ్లీ వెనకబడటమూ అంతే. ఇక వీరిద్దరి మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య స్నేహం గురించి.. ఇద్దరూ తరచూ చెబుతూనే ఉంటారు.

 

రోహిత్ శర్మ భార్యతో కోహ్లీ రొమాంటిక్ ఫోటో వైరల్:

రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే తో విరాట్ కోహ్లీ సెల్ఫీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఈ ఫోటో ఇప్పటిది కాదు. చాలా సంవత్సరాల క్రితం వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో అది. అయితే విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మను పెళ్లి చేసుకోక ముందు కొందరు హీరోయిన్లు, మోడల్స్ తో డేటింగ్ చేసినట్లు గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. వీరిలో రోహిత్ శర్మ భార్య రితికా తో కూడా కొన్నాళ్లు డేటింగ్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. దాదాపు 13 సంవత్సరాల క్రితం రితికాతో కలిసి ఓ సినిమాకు వెళ్ళాడు విరాట్ కోహ్లీ. 2013లో జింబాబ్వే పర్యటన నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ.. ఓ అమ్మాయితో కలిసి ముంబైలో తిరుగుతూ కనిపించాడు. ఆమెనే రితికా. ఆ సమయంలో రితికా ముంబైలో స్పోర్ట్స్ టాలెంట్ మేనేజర్ గా పనిచేసింది.

 

ఆ సమయంలో కోహ్లీతో కలిసి ఓ సినిమాకి వెళ్ళింది. అయితే అక్కడ ఫోటోగ్రాఫర్లు వీరిద్దరినీ చుట్టుముట్టి ఫోటోలు తీయడంతో ఇబ్బంది పడింది రితికా. తన చేతిని ముఖానికి అడ్డుగా పెట్టుకుంది. అయితే కోహ్లీకి రితికాకి 2010 ఐపీఎల్ సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మూడేళ్లపాటు విరాట్ కోహ్లీకి మేనేజర్ గా రితిక పనిచేసింది. ఆ సమయంలో తమ మధ్య ఏమీ లేదని, కేవలం స్నేహితులము మాత్రమేనని తెలిపాడు విరాట్ కోహ్లీ. ఆ సమయంలోనే ఈ ఫోటో వైరల్ గా మారింది. ఆ తరువాత రోహిత్ శర్మకి మేనేజర్ గా వ్యవహరించిన రితికా.. అతని ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. రోహిత్ – రితికా పెళ్లి 2017 డిసెంబర్ 13న జరగగా.. వీరి వివాహం జరిగిన రెండు సంవత్సరాల తర్వాత 2017 డిసెంబర్ 11న విరాట్ కోహ్లీ అనుష్క శర్మని పెళ్లి చేసుకున్నాడు.

Also Read: Odi Matches: వన్డే క్రికెట్ టైమింగ్స్ చేంజ్.. ఇకపై 11:30 AM మ్యాచ్ స్టార్ట్?

 

సూపర్ ఫామ్ లో రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ:

ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో అద్భుతమైన ఫామ్ ప్రదర్శిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ వరుసగా రెండు సెంచరీలతో విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. రాంచీలో జరిగిన మొదటి వన్డేలో 135 పరుగులు, రాయిపూర్ లో జరిగిన రెండవ వన్డేలో 102 పరుగులు చేశాడు. ఇక రోహిత్ శర్మ కూడా మొదటి వన్డేలో హఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్ కి ముందు జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో కూడా సెంచరీతో దుమ్ములేపి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Heartsays (@r.heartsays)

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×