E-Paper
Advertisement

ఉస్మాన్ తారిక్ లాగా విసిరేస్తున్నాడు..కృనాల్ బౌలింగ్ పై CSK ఫిర్యాదు

ఉస్మాన్ తారిక్ లాగా విసిరేస్తున్నాడు..కృనాల్ బౌలింగ్ పై  CSK ఫిర్యాదు
Advertisement

CSK On Krunal Pandya:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Chennai Super Kings ) మధ్య బిగ్ ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో చివరి వరకు పోరాడిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ వివాదం రాజుకుంది. కృనాల్ పాండ్యా ( krunal pandya ) బౌలింగ్ యాక్షన్ పై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తోంది. పాకిస్తాన్ బౌలర్ ఉస్మాన్ తారిక్ ( usman tariq) తరహాలోనే కృనాల్ పాండ్యా కూడా విసిరేస్తున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేసిందని సమాచారం అందుతోంది. దీంతో రంగంలోకి దిగిన బీసీసీఐ పెద్దలు, చెన్నై ఫిర్యాదు మేరకు కృనాల్ పాండ్యా బౌలింగ్ యాక్షన్ పై (krunal pandya bowling ) విచారణ మొదలుపెట్టారని అంటున్నారు.

Also Read: Shardul Thakur overthrow: శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

ఉస్మాన్ తారిక్ లాగా విసిరేస్తున్నాడు..కృనాల్ బౌలింగ్ పై CSK ఫిర్యాదు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా బౌలింగ్ శైలిపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. స్పిన్ బౌలర్ అయి ఉండి ఫాస్ట్ బౌలర్ తరహాలో బౌన్సర్లు వేశాడు కృనాల్ పాండ్యా. 125కి పైగా ఒక్కో బంతిని విసిరి బ్యాటర్ కు షాక్ ఇచ్చాడు. బౌన్సర్లు కూడా సంధించాడు. అయితే స్పిన్నర్ అయి ఉండి బౌన్సర్లు సంధిస్తే బ్యాటర్ల భద్రతకు పెను ప్రమాదం జరుగుతుందని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

శివ‌మ్ దూబే బ్యాటింగ్ చేసినప్పుడు ఇలాంటి సంఘటన జరిగినట్లు వీడియో క్లిప్ ను కూడా బీసీసీఐకి పంపినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన బీసీసీఐ, ఈ ఫిర్యాదుపై విచారణ కూడా మొదలుపెట్టింది. త్వరలోనే కృనాల్ పాండ్యాలను విచారణ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఉస్మాన్ తారిక్ తరహాలోనే కృనాల్ పాండ్యా బంతిని విసిరేస్తున్నాడని అటు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. ఇలాంటి బౌలర్లను ఐపిఎల్ నుంచి తొలగించాలని కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా గతంలో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ జరిగినప్పుడు కూడా కృనాల్ పాండ్యా అచ్చం ఇలాగే బంతులు విసిరేశాడు. వికెట్లు దాటకముందే వెనుక నుంచి బంతులు వేయడం కూడా స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ సందర్భంగా మాత్రం బీసీసీఐ దాకా పంచాయతీ వెళ్ళింది.

Advertisement

 

 

 

 

Also Read:  Tanveer Ahmed On MI: ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×