E-Paper
Advertisement

Horoscopes: సూర్య, చంద్రుల కలయికతో  ఆ తేదీలో పుట్టిన వారి జాతకం వేరే లెవల్లో ఉంటుందట

Horoscopes: సూర్య, చంద్రుల కలయికతో  ఆ తేదీలో పుట్టిన వారి జాతకం వేరే లెవల్లో ఉంటుందట
Advertisement

Horoscopes: సూర్య చంద్రుల కలయికతో ఆ తేదీలో పుట్టిన వారి జాతకం బ్రహ్మండంగా ఉంటుందట. వారి జీవితం గురించి చెప్పాల్సి వస్తే మరో లెవల్‌ అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ తేదీ ఏదీ ఆ జాతకుల జీవితం ఎలా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం..

న్యూమరాలజీ ప్రకారం 13వ తేదీలో పుట్టిన వారి జాతకంలో సూర్యుడు, చంద్రుడు కలిసి ఉంటారట. ఇలా ఉండటం అరుదైన విషయంగా చెప్తున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు అయితే 13వ తేదీలో పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుంది… వారి లైఫ్‌ ఎప్పుడు టర్న్‌ అవుతుంది లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వ్యక్తిత్వం మరియు స్వభావం: 13వ తేదీన పుట్టిన వారు సూర్యుడు, చంద్రుడి కలయికను కలిగి ఉంటారు. అంటే పదమూడులో ఉన్న ఒకటి సూర్యుడికి సంకేతం అయితే మూడు చంద్రుడికి సంకేతంగా భావిస్తారు. ఇలాంటి అరుదైన యోగం ఎవ్వరికీ ఉండదని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ యోగం వల్ల 13వ తేదీలో పుట్టిన వ్యక్తులు చాలా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారట. ఏదైనా పనిని మొండిగా సాధించే వరకు నిద్రపోరట. వీళ్లు ముక్కుసూటిగా మాట్లాడతారట. అబద్ధాలు చెప్పడం లేదా మోసపూరిత వ్యవహారాలు వీరికి నచ్చవట. పాత పద్ధతుల కంటే కొత్త విషయాలను కనిపెట్టడం లేదా విభిన్నంగా ఆలోచించడం వీరి ప్రత్యేకతట.

కెరీర్ మరియు స్థిరపడే రంగాలు: 13వ తేదీలో పుట్టిన వారు ప్లానింగ్ మరియు మేనేజ్‌మెంట్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారట. ముఖ్యంగా సాంకేతిక రంగంలో వీరు అద్బుతంగా ఎదుగుతారట. ఇంజనీరింగ్, ఐటీ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లాంటి రంగాలు వీరికి కలిసి వస్తాయట. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు, మేనేజ్‌మెంట్ లేదా ఆర్గనైజేషనల్ లీడర్‌షిప్ లాంటి వ్యవహారాల్లో కూడా వీళ్లు రాణిస్తారట. అలాగే భవన నిర్మాణ రంగం లేదా రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో వీళ్లు అద్బుతమైన ప్రగతి సాధిస్తారట. వీరు మంచి రచయితలు లేదా పరిశోధకులుగా కూడా గుర్తింపు పొందుతారట.

Advertisement

జీవితంలో టర్నింగ్ పాయింట్: 13వ సంఖ్యను చాలామంది సంక్లిష్టమైనదిగా భావిస్తారు, కానీ అది అదృష్టాన్ని కూడా తెస్తుందట. వీరి జీవితంలో  22, 31, 40 ఏళ్ల వయస్సు ముఖ్యమైన మలుపులు ఉంటాయట. సాధారణంగా 30 ఏళ్ల తర్వాత వీరి జీవితంలో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందట. ఏప్రిల్, ఆగస్టు మరియు సెప్టెంబర్  నెలలు వీరికి కీలకమైన మార్పులను తీసుకువస్తాయట.

అలాగే శనివారం, ఆదివారం వీరికి అనుకూలమైన రోజులట. అయితే అతిగా ఆలోచించడం (Overthinking) కోపం తగ్గించుకుంటే వీరు అనుకున్న లక్ష్యాలను త్వరగా చేరుకుంటారట. నీలం మరియు వెండి రంగులు వీరికి సానుకూల శక్తినిస్తాయట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: భార్యలను బాధపెట్టే భర్తలు ఎక్కువగా ఆ రాశుల్లోనే పుడతారట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×