E-Paper
Advertisement

Ind vs Sa Odi: దక్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న టీమిండియా ప్లేయ‌ర్

Ind vs Sa Odi: దక్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న టీమిండియా ప్లేయ‌ర్
Advertisement

Ind vs Sa Odi:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa ) మధ్య నవంబర్ 30వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ( kuldeep yadav ) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నేషనల్ డ్యూటీ కోసం తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు కుల్దీప్ యాదవ్. మొదట తనకు లీవ్ కావాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ముందు కుల్దీప్ యాదవ్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడట. అయితే దానికి బీసీసీఐ ఒప్పుకుందో ? లేదో ? తెలియదు కానీ, వన్డే సిరీస్ ఆడేందుకే కుల్దీప్ యాదవ్ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్… పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న కుల్దీప్ యాదవ్!

Advertisement

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఉన్న నేపథ్యంలో తన పెళ్లిని కుల్దీప్ యాదవ్ వాయిదా వేసుకున్నాడట. వాస్తవంగా నవంబర్ చివరి వారం లో తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను ( Vanshika) వివాహం ఆడేందుకు కుల్దీప్ యాదవ్ ( kuldeep yadav marriage )నిర్ణయం తీసుకున్నాడట. వీళ్ళ ఎంగేజ్మెంట్ జూన్ 4వ తేదీ 2025 లోనే జరిగింది. దీంతో నవంబర్ చివరి వారంలో పెళ్లి ఫిక్స్ చేసుకున్నారట. కానీ బీసీసీఐ లీవ్ ఇవ్వకపోవడంతో కుల్దీప్ యాదవ్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేషనల్ డ్యూటీ కోసం తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడని ప్రచారం సాగుతోంది.

ఇక వాయిదా పడ్డ పెళ్లి ఫిబ్రవరిలో జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. నవంబర్ 30వ తేదీన ప్రారంభం కానున్న వన్డే సిరీస్ డిసెంబర్ 6వ తేదీ వరకు జరుగుతుంది. ఇక డిసెంబర్ లో మంచి ముహూర్తాలు లేవు. కొత్త ముహూర్తాలు ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయట. అందుకే తన పెళ్లిని ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నాడట టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. అంటే దక్షిణాఫ్రికా తో జరిగే వన్డే సిరీస్ లో కుల్దీప్ యాదవ్ ఆడతాడు అన్నమాట. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్న కుల్దీప్‌ యాదవ్

చిన్ననాటి స్నేహితురాలు వంశికను ( Vanshika ) పెళ్లి చేసుకోబోతున్నాడు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep yadav). వీళ్ళిద్దరూ చిన్నప్పటినుంచి రిలేషన్ లో ఉన్నారట. అయితే జూన్ 4వ తేదీ 2025 సంవత్సరంలో లక్నో వేదికగా కుల్దీప్‌ యాదవ్ వంశిక ఇద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. లక్నోకు చెందిన వంశిక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తోంది. జూన్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీళ్ళు నవంబర్ లో పెళ్లి చేసుకోవాలని ముందే ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు డేట్ మార్చుకునే యోచ‌నలో ఉన్నారు.

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×