E-Paper
Advertisement

Spirit pooja Ceremony: హమ్మయ్య స్పిరిట్ మొత్తానికి స్టార్ట్.. మెగాస్టార్ చేతుల మీదుగా..

Spirit pooja Ceremony: హమ్మయ్య స్పిరిట్ మొత్తానికి స్టార్ట్.. మెగాస్టార్ చేతుల మీదుగా..
Advertisement

Spirit pooja Ceremony: ప్రభాస్ అభిమానులు గత కొద్దిరోజులుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రభాస్(Prabhas) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి (Sandeep Reddy)దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాకు స్పిరిట్(Spirit) అని టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ప్రభాస్ అభిమానులు కొంత పాటి అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ప్రభాస్ అభిమానులకు సందీప్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా..

ఇటీవల ఈయన నవంబర్ చివరి వారంలో స్పిరిట్ సినిమా పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. చెప్పిన విధంగానే ఈ సినిమా పూజా కార్యక్రమాల(Pooja Ceremony)ను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలలో ప్రభాస్ కనిపించకపోవడం గమనార్హం. ఇక సందీప్ రెడ్డి వంగాతో పాటు చిత్ర నిర్మాతలు హీరోయిన్ త్రిప్తి ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు. ఇలా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.

పూజా కార్యక్రమాలకు దూరంగా ప్రభాస్…

Advertisement

ఇప్పటికే ప్రభాస్ కి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తి అయిందని ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉండబోతోంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇక ప్రభాస్ ఇందులో పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు అలాగే ఖైదీగా కూడా కనిపించబోతున్నట్టు ఇటీవల ఒక ఆడియో టీజర్ ద్వారం వెల్లడించారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి తదితరులు కూడా కీలకపాత్రలలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఇలా ఈ సినిమా పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభాస్ కనిపించకపోవడంతో మా రాజుగారు ఎక్కడ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్  పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారని తెలుస్తోంది.  ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ పతాకంపై ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏకంగా తొమ్మిది భాషలలో విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ బయటకు రావడంతో ప్రభాస్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: I Bomma Ravi Father: ఆ నిర్మాతను ఎన్కౌంటర్ చేసి పడేయ్యాలి.. ఐబొమ్మ రవి తండ్రి సంచలన వ్యాఖ్యలు

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×