E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు యువకులు మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు యువకులు మృతి
Advertisement

Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. సరూర్ నగర్‌ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు అదుపు తప్పి మెట్రోపిల్లర్ ను ఢీకొన్నారు. ఈ ఘటన సీసీ కెమరాలో రికార్డు అయ్యింది. మృతుల వివరాలు చూస్తే.. హరీష్, మధుగా గుర్తించారు పోలీసులు. వీరిద్దరు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సరూర్ నగర్ పోలీసులు తెలిపారు. ఇద్దరు యువకులు సరూర్ నగర్‌కి చెందిన వారిగా గుర్తించారు.

Also Read: బయోడీజిల్ బంక్‌లో బ్లాస్ట్.. ఇద్దరు స్పాట్..!

Advertisement

ఈ ప్రమాదం మరోసారి రోడ్లపై అతి వేగం ఎంత ప్రమాదకరమో గుర్తు చేసింది. మెట్రో కారిడార్ ప్రాంతాల్లో రాత్రివేళ ట్రాఫిక్ తక్కువగా ఉంటుందనే భావనతో కొంతమంది యువత వేగంగా ప్రయాణిస్తుంటారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఈ ప్రమాద దృశ్యాలు సమాజానికి ఒక కఠినమైన హెచ్చరికగా మారాయి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×