E-Paper
Advertisement

Davos-2026: ప్రపంచంలో తొలి బ్యూటీ టెక్ జీసీసీ హైదరాబాద్‌లో.. నవంబర్‌లో ప్రారంభం

Davos-2026: ప్రపంచంలో తొలి బ్యూటీ టెక్ జీసీసీ హైదరాబాద్‌లో.. నవంబర్‌లో ప్రారంభం

Davos-2026: ప్రపంచంలో తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్-GCC హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు లోరియల్ సంస్థ ఆ విషయాన్ని ప్రకటించింది. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్-2026 సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్‌తో భేటీ తర్వాత ఆ కంపెనీ ప్రకటన చేసింది.

ప్రపంచంలో తొలి బ్యూటీ టెక్ జీసీసీ హైదరాబాద్‌లో

ప్రపంచంలోనే తొలి బ్యూటీ- టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ప్రస్తుతం దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్-2026 సదస్సులో లోరియల్ (L’Oreal) సంస్థ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్ తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రకటన చేసింది. హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులతో బ్యూటీ–టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించింది. జీసీసీ ఏర్పాటుతో లోరియల్‌కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనుంది.

దావోస్ వేదికగా సీఎం రేవంత్ తో ఆ సంస్థ సీఈవో భేటీ

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో సాంకేతిక పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందిస్తామని ఆ కంపెనీ సీఈవో తెలిపారు. దీంతో గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ కార్యకలాపాలకు హైదరాబాద్ ప్రాముఖ్యత మరింత పెరుగనుందని తెలిపారు. నవంబర్‌లో జీసీసీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు లను ఆ సంస్థ ఆహ్వానించింది.

లోరియల్ జీసీసీని హైదరాబాద్‌కు తీసుకురావాలన్న ఆలోచనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఆసక్తి చూపారని, ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రదేశమని చెప్పారు. మెడ్‌టెక్‌, హెల్త్‌టెక్‌ మాత్రమే కాకుండా బ్యూటీ–టెక్‌ వంటి కొత్త విభాగాల్లో తెలంగాణ ముందుంటోందని అన్నారు.

ALSO READ: ఫోన్ ట్యాపింగ్ కేసు స్పీడప్.. మరో ఆరుగురు నేతలకు నోటీసులు?

ఇప్పటికే మారియెట్, వ్యాన్ గార్డ్, నెట్ ఫ్లిక్స్, మెక్ డోనాల్డ్స్, హినెకెన్ , జాగర్ , కోస్ట్కో వంటి గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్‌లో జీసీసీలను ఏర్పాటు చేశాయన్నారు. జీసీసీతో పాటు మాన్యుఫాక్షరింగ్ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని లోరియల్ సంస్థను ఆహ్వానించారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పరిశ్రమల ఎకోసిస్టమ్‌ను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ సీఈవో హియెరోనిమస్ సానుకూలంగా స్పందించారు.

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×