E-Paper
Advertisement

RWF Recruitment: ఇండియన్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు.. నెలకు రూ. 12,261 స్టైఫండ్, ఈ అర్హత ఉంటే చాలు..!

RWF Recruitment: ఇండియన్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు.. నెలకు రూ. 12,261 స్టైఫండ్, ఈ అర్హత ఉంటే చాలు..!
Advertisement

నిరుద్యోగులకు ఇది భారీ గుడ్ న్యూస్.. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ (RWF) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 ఏడాదికి గాను వివిధ ట్రేడ్లలో ఖాళీగా ఉన్న 192 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సాంకేతిక రంగంలో నైపుణ్యం సాధించి రైల్వేలో స్థిరపడాలనుకునే యువతకు ఇది చక్కని అవకాశం అని చెప్పవచ్చు.

పోస్టుల వివరాలు: 

Advertisement

మొత్తం 192 పోస్టులలో ఫిట్టర్ ట్రేడ్‌కు అత్యధికంగా 85 ఖాళీలు ఉన్నాయి. మెషినిస్ట్ విభాగంలో 31 పోస్టులు ఉండగా.. సీఎన్‌సీ ప్రోగ్రామింగ్-కమ్-ఆపరేటర్ విభాగంలో 23 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్ మెకానిక్ 22, ఎలక్ట్రీషియన్ 18, మెకానిక్ మోటార్ వెహికల్ 8, టర్నర్ విభాగంలో 5 పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత:

Advertisement

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NTC) తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు:

అభ్యర్థుల వయస్సు 2026 మార్చి 1 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

స్టైఫండ్:

శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఫిట్టర్, మెషినిస్ట్, మోటార్ వెహికల్ మెకానిక్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ అభ్యర్థులకు రూ. 12,261 లభిస్తుంది. సీఎన్‌సీ ప్రోగ్రామింగ్-కమ్-ఆపరేటర్ ట్రేడ్ అభ్యర్థులకు రూ. 10,899 చెల్లిస్తారు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ:

ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మెరిట్ జాబితాలో నిలిచిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం:

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. దరఖాస్తులు సమర్పించడానికి 2026 ఏప్రిల్ 1 చివరి తేదీగా నిర్ణయించారు.

అభ్యర్థులు గడువులోగా అధికారిక వెబ్‌సైట్ సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. రైల్వే రంగంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించడానికి ఈ అప్రెంటిస్‌షిప్ ఎంతో దోహదపడుతుంది.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://rwf.indianrailways.gov.in/

ALSO READ: TTD BIRRD: రూ. 2.50 లక్షల వరకు జీతం.. టీటీడీ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×