E-Paper
Advertisement

Burj Khalifa: టార్గెట్ బుర్జ్ ఖలీఫా.. ప్రపంచంలోనే ఎత్తైన ఈ భవనమే ఇరాన్ టార్గెట్? ఎందుకంటే..

Burj Khalifa: టార్గెట్ బుర్జ్ ఖలీఫా.. ప్రపంచంలోనే ఎత్తైన ఈ భవనమే ఇరాన్ టార్గెట్? ఎందుకంటే..
Advertisement

బుర్జ్ ఖలీఫా (Burj Khalifa).. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా పేరొందిన ఈ నిర్మాణం ఇప్పుడు.. ఇరాన్‌గా టార్గెట్‌గా మారిందా? ఈ పశ్నకు ఔననే సమాధానం వస్తోంది. ఎందుకంటే.. ఈ భవనం దుబాయ్‌కు వెన్నుముక వంటిది. పైగా నిత్యం పర్యటకులతో కిటకిటలాడే ప్రాంతం ఇది. దుబాయ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ భవనంపై నుంచి నగరం మొత్తాన్ని చూస్తే గానీ తిరిగి వెళ్లరు. అందుకే, ఈ భవనాన్ని ఇరాన్ టార్గెట్ చేసుకుని ఉండవచ్చని తెలుస్తోంది. పైగా శనివారం ఇరాన్ చేసిన దాడిలో ఒక క్షిపణి ఈ భవనానికి కొద్ది దూరంలోనే పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించారు. దాడి సమయానికి ఈ భవనంలో సుమారు 10 వేల మంది ఉన్నారని సమాచారం. ఇరాన్ నేరుగా దాన్ని లక్ష్యం చేసుకుని ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

ఏమిటీ ఈ భవనం ప్రత్యేకత?

⦿ బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు. ఇందులో మొత్తం 163 అంతస్తులు ఉన్నాయి. వీటిలో 9 ఫ్లోర్లు మెయింటెనెన్స్ లెవల్స్. దీన్ని హైమెనోకల్లిస్ పుష్పం స్ఫూర్తితో నిర్మించారు. ఇందులో లగ్జరీ హోటల్స్‌తోపాటు.. 900 పైగా రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు ఉన్నాయి. ఆఫీసులు సైతం ఉన్నాయి. దాదాపు 3వేలకు పైగా పార్కింగ్ స్పాట్లు ఉన్నాయి.

Advertisement

⦿ ఈ భవనాన్ని 2004లో మొదలుపెట్టి.. 2010లో పూర్తి చేశారు. ఇంత పెద్ద భవనాన్ని కేవలం ఆరేళ్లల్లో పూర్తి చేయడమంటే మాటలు కాదు. రోజుకు 12వేలకు పైగా వర్కర్లు నిర్విరామంగా పనిచేస్తూ.. అనుకున్న సమయంలో దీన్ని పూర్తిచేయడం విశేషం. దీన్ని పూర్తిగా రీన్ఫోర్స్డ్ కాంక్రీట్, స్టీల్, అల్యూమినియంతో నిర్మించారు.

⦿ దుబాయ్‌లోని వేడిని తట్టుకొనే విధంగా బుర్జ్ ఖలీఫాను నిర్మించారు. ఈ భవనం ఎత్తుతోపాటు ఫ్లోర్స్, ఎలివేటర్, ఆబ్జర్వేషన్ డెక్ వంటివన్నీ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించాయి. చెప్పాలంటే ఇది సాధారణ భవనం కాదు. ఒక వెర్టికల్ సిటీ.. అంటే నిలువుగా ఉన్న ఒక చిన్న నగరం లాంటిది. ఇందులోని 124, 125, 148 ఫ్లోర్లలో అబ్జర్వేషన్ డెస్కులు ఉన్నాయి. అక్కడ నిలబడి చూస్తే దుబాయ్ మొత్తం కనిపిస్తుంది.

ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ప్రజల పరిస్థితి ఏమిటీ?

Advertisement

దుబాయ్ అంటే.. ఒక చిన్న ప్రపంచం. ఇక్కడ వివిధ దేశాల ప్రజలు జీవిస్తున్నారు. భారతీయుల సంఖ్య కూడా ఎక్కువే. ముఖ్యంగా భవన నిర్మాణాలు, కర్మాగారాల్లో పనిచేసేదంతా మన భారతీయులే. వారిలో తెలుగు, తమిళం, మలయాళీ ప్రజలు ఎక్కువ శాతం ఉంటారు. అలాగే మన దేశానికి చెందిన పెద్ద పెద్ద సెలబ్రిటీలు, వ్యాపార దిగ్గజాలు సేద తీరే నగరం కూడా ఇదే. ప్రస్తుతం దాడుల్లో ప్రాణం నష్టం తక్కువే ఉంది. అమెరికా, యూఏఈ బలగాలు ఇరాన్ దాడులను తిప్పి కొడుతున్నాయి. అయితే, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన ప్రజలను వెంటాడుతోంది. అబుదాబిలో కూడా ఇదే పరిస్థితి. భారత ప్రభుత్వం కూడా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

ఆ నగరాలే లక్ష్యంగా దాడులు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(UAE)లోని అబుదాబి, దుబాయ్‌, ఖతార్‌లోని దోహా, సౌదీ అరేబియాలోని రియాద్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. అబుదాబిలోని నివాస ప్రాంతంలో క్షిపణి శిథిలాలు పడి ఒక వ్యక్తి చనిపోయాడని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ చర్యలకు తెగబడింది. ‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’ పేరుతో టెహ్రాన్ లక్ష్యంగా అమెరికా క్షిపణి దాడులు మొదలు పెట్టింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ మొహమ్మద్ పక్‌పూర్ ఈ దాడుల్లో మరణించారని ఇజ్రాయెల్ వెల్లడించింది.

Also Read: దుబాయ్‌ పై ఇరాన్ డ్రోన్ దాడి.. భయంలో తెలుగువారు.. విమాన సర్వీసులు రద్దు

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×