E-Paper
Advertisement

Manoj Tiwari: గిల్ కెప్టెన్సీని వెంట‌నే పీకేయండి..టీమిండియా బ‌త‌కాలంటే, రోహిత్ శ‌ర్మ‌కు ప‌గ్గాలు ఇవ్వాల్సిందే

Manoj Tiwari: గిల్ కెప్టెన్సీని వెంట‌నే పీకేయండి..టీమిండియా బ‌త‌కాలంటే, రోహిత్ శ‌ర్మ‌కు ప‌గ్గాలు ఇవ్వాల్సిందే
Advertisement

Manoj Tiwari: 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ మళ్ళీ ఇవ్వాలని చాలామంది డిమాండ్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే అంశంపై తాజాగా మాజీ క్రికెటర్ మ‌నోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం పీకాడని రోహిత్ శర్మను ( Rohit Sharma ) తొలగించి, గిల్ కు కెప్టెన్సీ ఇచ్చారని నిప్పులు చెరిగారు మనోజ్ తివారి. వెంటనే గిల్ ( Shubman Gill) కెప్టెన్సీ తొలగించి రోహిత్ శర్మకు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీమిండియాను కాపాడడం ఎవరి తరం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటే కచ్చితంగా టీమిండియా టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మ‌నోజ్ తివారీ ( Manoj Tiwari ).

Also Read: Yuzvendra Chahal: మ‌రో లేడీ చేతిలో మోస‌పోయిన యుజ్వేంద్ర చాహల్..రూ.60 కోట్లు నొక్కేసి..అన్ ఫాలో చేసిందిగా!

వెంటనే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వండి – మ‌నోజ్ తివారీ

Advertisement

టీమిండియా కు ఎన్నో విజయాలు అందించిన అనుభవం రోహిత్ శర్మకు ఉంది… అలాంటి రోహిత్ శర్మాను పక్కకు పెట్టడం దారుణం అన్నారు మాజీ క్రికెటర్ మ‌నోజ్ తివారీ. ఇప్పటికైనా బీసీసీఐ దీనిపై ఆలోచన చేయాలని కోరారు. లేకపోతే టీమిండియా మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. 2027 వన్డే వరల్డ్ కప్ అయిపోయే వరకు రోహిత్ శర్మకు వన్డే కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా అయితేనే టీమిండియా ఫ్యూచర్ బాగుంటుందని సూచనలు చేశారు. శుభమన్ గిల్ ఏం పీకాడని అతడికి కెప్టెన్సీ ఇచ్చారని ఫైర్ అయ్యారు. కేవలం ఐపిఎల్ లో ఆడాడని కెప్టెన్సీ ఇస్తే, ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోవాల్సి వచ్చిందని చురకలు అంటించారు. ఇలాంటి గిల్, ఐసీసీ టోర్నమెంట్లు జరిగితే సరిగ్గా టీం ఇండియాను డీల్ చేయలేక పోతాడని వెల్లడించారు మ‌నోజ్ తివారీ ( Manoj Tiwari ).

అదే రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా అద్భుతంగా రాణిస్తుందన్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 90% 2027 వన్డే వరల్డ్ కప్ గెలిచే అవకాశం టీమిండియా కు ఉంటుందని సూచనలు చేశారు. అదే గిల్ కెప్టెన్ గా ఉంటే 50% మాత్రమే ఛాన్సులు ఉంటాయని కీలక ప్రకటన చేశారు. విరాట్ కోహ్లీ లాగానే గిల్ కూడా ఓవరాక్షన్ చేస్తున్నాడని మండిపడ్డారు. కెప్టెన్ గా సక్సెస్ కావాలంటే కాస్త కూల్ గా ఉండాలని కోరారు. అయినా కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగించేది కాదని వెల్లడించారు. అది అతని కెరీర్ లోనే పెద్ద అవమానం అంటూ వ్యాఖ్యానించారు. అతనికి సరైన గౌరవం దక్కాలంటే ఖచ్చితంగా కెప్టెన్సీ ఇవ్వాలని సూచనలు చేశారు మ‌నోజ్ తివారీ. ఈ విషయంలో ఐసీసీ జై షా ( Jay Shah) కూడా జోక్యం చేసుకుంటే బాగుంటుందని కోరారు.

Advertisement

Also Read: RCB Players-Indian roads: ఇండియ‌న్ రోడ్ల‌పై RCB లేడీ ప్లేయ‌ర్లు…గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోండిరా ? బంగ్లాపై ట్రోలింగ్‌

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×