E-Paper
Advertisement

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?
Advertisement

డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల అధ్యక్ష పదవీకాలంలో సరిగ్గా రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో.. మిడ్ టెర్మ్ ఎన్నికలను ఎదుర్కోనున్నారు. ఈ ఎన్నికల్లో నేరుగా అధ్యక్ష పదవికి ఓటింగ్ ఉండదు. కానీ, అమెరికన్ పార్లమెంట్ (కాంగ్రెస్) లోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సీట్లు, సెనెట్‌లోని మూడో వంతు స్థానాలు, పలు రాష్ట్రాల గవర్నర్ పదవులకు పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్‌లో ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్లు మెజారిటీని కోల్పోతే, ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలు, బిల్లులు.. కీలక నిర్ణయాలకు పార్లమెంటరీ విచారణలు, శాసనపరమైన అడ్డంకులు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అందుకే, ఈ మధ్యంతర తీర్పు తన పాలనకు రాజకీయ సవాలుగా మారకూడదనే ఉద్దేశంతోనే ట్రంప్ ఇంధన ధరల తగ్గింపు, రష్యా డీజిల్ ఒప్పందాలు, ఇరాన్‌పై వ్యూహాత్మక ఒత్తిళ్ల రూపంలో భారీ గేమ్‌ప్లాన్ అమలు చేస్తున్నారు.

గెలుపు కోసం.. కొత్త గేమ్!

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగితే సామాన్య అమెరికన్‌ల జేబుపై భారం.. ఆ ప్రభావం నేరుగా ఓటు మీద పడొచ్చు. అందుకే ఇంధన ధరలు తగ్గించేందుకు రష్యా నుంచి డీజిల్‌ సరఫరాలకు ట్రంప్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యాపై కొన్ని ఆంక్షల అమలును కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. తాము కొంటున్నాం కాబట్టి భారత్ కూ 100 శాతం టారిఫ్ వార్ పై రిలీఫ్ ఇచ్చారు. మరోవైపు భారత టెక్ నిపుణుల గ్రీన్‌కార్డ్‌ అప్లికేషన్లకు కీలకమైన PERM ప్రక్రియపై పలు సంస్థలకు ఆంక్షలు విధించడంతో ఎన్నారైల్లో ఆందోళన పెరిగింది. ఇరాన్‌ విషయంలోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయ్. అణు కేంద్రాలపై దాడి కోసం మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌ వినియోగంపై లీకులిస్తున్నారు ట్రంప్. దీనికి ఎన్నికలే కారణమన్న టాక్ కూడా నడుస్తోంది. రిపబ్లికన్లు కాంగ్రెస్‌లో మెజారిటీ కోల్పోతే ట్రంప్‌ నిర్ణయాలపై విచారణలు, బడ్జెట్‌ పోరాటాలు, శాసనపరమైన అడ్డంకులు పెరగొచ్చు. అధ్యక్ష పదవి తక్షణమే పోకపోయినా, ప్రజల తీర్పు ఆయన పాలనకు రాజకీయ సంకేతంగా నిలవనుంది. అందుకే ట్రంప్ సాధ్యమైనంత గేమ్ ప్లాన్ ఆడేందుకే చూస్తున్నారు.

ఓట్ల కోసం.. ఏకంగా రష్యాతో ఒప్పందం?

Advertisement

అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం నేరుగా సామాన్య పౌరుల బడ్జెట్‌పై పడుతుంది. దీని వల్ల ప్రజలలో అసంతృప్తి పెరుగుతుంది. అంతిమంగా ఇది ఓటింగ్ సరళిని మార్చే ప్రమాదం ఉంది. ఈ ముప్పును ముందుగానే గ్రహించిన ట్రంప్, రష్యా నుంచి డీజిల్ సరఫరాల కోసం ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రష్యాపై ఉన్న కొన్ని ఆంక్షలను తాత్కాలికంగా పక్కన పెట్టడం గమనార్హం. అంతేకాకుండా, అమెరికా స్వయంగా కొనుగోళ్లు జరుపుతున్నందున, భారత్‌పై విధించాలుకున్న 100 శాతం సుంకాల నుంచి కూడా ఉపశమనం లభించినట్లయింది.

భారత టెక్ నిపుణులకు.. PERM సవాళ్లు

భారత్‌కు సుంకాల్లో ఊరట లభించినప్పటికీ, భారతీయ ఐటీ నిపుణులకు మాత్రం కష్టాలు తప్పలే లేవు. ముఖ్యంగా గ్రీన్ కార్డ్ ప్రక్రియలో అత్యంత కీలకమైన PERM అప్లికేషన్లపై పలు సంస్థలకు ఆంక్షలు విధించారు. దీంతో ప్రవాస భారతీయ వ్యాపారులు, సంస్థలకు ఎన్నడూలేనంత ఎదురు దెబ్బ తగిలింది. అమెరికన్లకే స్థానిక ఉద్యోగాలు దక్కాలనే రాజకీయ కోణంలోనే ట్రంప్ ఈ ఆంక్షలు అమల్లోకి తెచ్చారని, దీని ద్వారా అమెరికా ప్రజలను మెప్పించవచ్చనేది ఆయన ప్లాన్ అని అంటున్నారు.

ఇరాన్‌పై ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ బెదిరింపులు

Advertisement

ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అత్యంత శక్తివంతమైన ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ (MOAB)ను ఉపయోగిస్తామంటూ లీకులు ఇవ్వడం వెనుక కూడా ఎన్నికల వ్యూహం ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అమెరికన్లలో జాతీయతా భావాన్ని రగిల్చి.. ఓట్లను పొందాలనేది ట్రంప్ మామ ప్లాన్ అని తెలుస్తోందని పేర్కొంటున్నారు.

మెజారిటీ కోల్పోతే ఏమవుతుంది?

ఈ ఎన్నికల్లో మెజారిటీ కోల్పోతే ట్రంప్ పాలనకు తీవ్ర ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై పార్లమెంటరీ విచారణలు, బడ్జెట్ ఆమోదంలో అడ్డంకులు, చట్టాల రూపకల్పనలో తిరుగుబాట్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అధ్యక్ష పదవికి తక్షణమే ముప్పు లేకపోయినా, ఈ ఎన్నికల తీర్పు ఆయన రాజకీయ భవిష్యత్తును శాసించే సంకేతంగా మారనుంది. అందుకే అన్ని వైపుల నుంచి పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ట్రంప్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అమెరికన్ల మెప్పు పొందడానికి తనకు తెలిసిన వ్యూహాలన్నీ అమలు చేస్తున్నారు.

Tags

Related News

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×