E-Paper
Advertisement

Adam Zampa: ఐపీఎల్ అంటేనే న‌ర‌కం, డ‌బ్బులు కూడా స‌రిగ్గా ఇవ్వ‌రు..అందుకే పారిపోయి పాకిస్తాన్‌ వ‌చ్చా

Adam Zampa: ఐపీఎల్ అంటేనే న‌ర‌కం, డ‌బ్బులు కూడా స‌రిగ్గా ఇవ్వ‌రు..అందుకే పారిపోయి పాకిస్తాన్‌ వ‌చ్చా
Advertisement

Adam Zampa:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ( Adam Zampa) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ అంటేనే నరకమని.. టాలెంట్ కు తగ్గ డబ్బులు అక్కడ ఇవ్వడం లేదని బాంబు పేల్చాడు. అందుకే ఐపిఎల్ టోర్నమెంట్ ఆడకుండా పారిపోయి పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ అద్భుతంగా సాగుతోందని.. ఇందులో ఆడడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. విదేశీ క్రికెట‌ర్ల‌కు స‌రైన లీగ్ ఇదేన‌న్నారు. దీంతో ఆడమ్ జంపా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాల‌ను త‌యారు చేస్తా

ఐపీఎల్ అంటేనే న‌ర‌కం, డ‌బ్బులు కూడా స‌రిగ్గా ఇవ్వ‌రు

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు టోర్నమెంట్లు ఒకేసారి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను బ్లేమ్ చేసేందుకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, అక్కడి ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా రెచ్చిపోయి ప్రవర్తించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆడమ్ జంపా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన విషం కక్కాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ బెటర్ అని వ్యాఖ్యానించారు.

తాను కిందటి ఏడాది వరకు ఐపిఎల్ లోనే ఆడాను.. కానీ ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడుతున్నట్లు వెల్లడించారు. తనకు ఉన్న టాలెంట్ కు తగ్గ డబ్బులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అస్సలు లభించలేదు. ఐపీఎల్ ఓనర్లు చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తారని సీరియస్ అయ్యారు. చాకిరి చేయించుకుంటారు తప్ప డబ్బులు సరిగ్గా ఇవ్వరని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పాపులర్ అని ఐపిఎల్ కు మంచి పేరు ఉంది.. కానీ లోపల జరిగేదంతా ఫేక్ అంటూ విమర్శలు చేశారు. అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నానని వెల్లడించారు. అయితే నెల రోజుల కిందటే తనకు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో ఆడే అవకాశం వచ్చినట్లు వ్యాఖ్యానించారు. ఇదంతా చక చకా జరిగిపోయిందని స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు.

ఆడమ్ జంపా ఐపీఎల్ కెరీర్

Advertisement

2016 సంవత్సరం నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడుతున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా. ఈ సందర్భంగా మొత్తం నాలుగు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ చివరగా హైదరాబాద్ జట్టు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2025 టోర్నమెంట్ సందర్భంగా మధ్యలోనే గాయం కారణంగా వైదొలిగాడు.

Also Read: PSL 2026: PSLను అత‌లాకుత‌లం చేసిన తుఫాన్‌..గాల్లో ఎగిరిప‌డ్డ గ్రౌండ్ మెన్లు

 

 

 

 

Related News

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

Big Stories

Advertisement
×