E-Paper
Advertisement

Jagan on Ap Capital: రాజధానుల గురించి రాజ్యాంగంలో లేదు.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Jagan on Ap Capital: రాజధానుల గురించి రాజ్యాంగంలో లేదు.. జగన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Jagan on Ap Capital: ఏపీ రాజధాని అమరావతి బిల్లు బుధవారం లోకసభకు వచ్చింది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. అమరావతి విషయంలో గడిచిన ఏడేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. అంతేకాదు నిజంగా అమరావతి సెల్ఫ్ ప్రాజెక్టా అంటూ ప్రశ్నలు సంధించారు.

ఏపీ రాజధాని అమరావతిపై జగన్ హాట్ కామెంట్స్

ఏపీ రాజధాని అమరావతి బిల్లు బుధవారం లోక్ సభలో కేంద్రం ప్రవేశ పెట్టింది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు తీర్మానం పేరిట ప్రభుత్వం ఎందుకు డ్రామాలు చేస్తోందని ప్రశ్నించారు. దాదాపు ఏడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, లక్షల ఎకరాల్లో ఏయే నిర్మాణాలు చేపట్టారని ప్రశ్నలు సంధించారు.

Advertisement

సీఎం చంద్రబాబు చెబుతున్నట్టుగా అమరావతి సెల్ఫ్ ప్రాజెక్టా? మరి అమరావతి ఎంతవరకు వచ్చిందన్నారు. కనీసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా? మొదట తీసుకున్న 50 వేల ఏకరాల్లో కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజ్, వాటర్ సదుపాయాలకు ఎకరాకు రెండు కోట్లు అవుతుందని స్వయంగా సీఎం చంద్రబాబు వేసిన లెక్కల ద్వారా తెలుస్తుందన్నారు.

అమరావతి పేరిట డ్రామాలు ఎందుకని ప్రశ్న

50 వేల ఎకరాలకు అయ్యే ఖర్చు అక్షరాలా లక్ష కోట్లని అన్నారు. దీనికే దిక్కులేదని అదనంగా మరో 50 వేల ఎకరాలు సేకరిస్తున్నారని అన్నారు. ఈ విధంగా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తుందని ప్రశ్నలు లేవనెత్తారు. ఆ డబ్బులు ఎలా వస్తాయన్నారు. లక్ష ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రెండు లక్షల కోట్లు అవుతుందన్నారు. ఈ డబ్బులు ఎలా వస్తాయని, ఎన్నోళ్లు పడుతుందన్నారు.

Advertisement

2019లో చూపించిన బాహుబలి సెట్టింగులతో వేసిన మాస్టర్ ప్లాన్, మళ్లీ ఎందుకు మారుస్తున్నారని లేవనెత్తారు. ఐదున్నర గంటలపాటు అమరావతిపై చర్చించిన ప్రభుత్వం, కేవలం జగన్, వైసీపీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే ఉపయోగించుకున్నారని తేల్చిచెప్పారు.

రాష్ట్రాలకు రాజధాని గురించి రాజ్యాంగంలో లేదన్నారు. దేశానికి రాజ్యాంగం ఉంటుంది తప్పా, రాష్ట్రాలకు రాజధాని అనేది ఉండదన్నారు. సాక్షాత్తూ కేంద్రప్రభుత్వం కూడా రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అని తేల్చి చెప్పిందన్నారు. రాజధాని విషయంలో కేంద్రప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని అఫిడవిట్‌లో ఏపీ హైకోర్టులో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. జార్ఖండ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు రాజధానుల విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని, కేంద్రం నిర్ణయించలేదన్నారు.

 

 

 

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×