E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఏసి కోసం రచ్చ చేసిన శ్రీయ.. రాజేంద్రకు నిజం చెప్పిన పార్వతి.. అవనిని చంపేందుకు పల్లవి మరో ప్లాన్..

Intinti Ramayanam Today Episode: ఏసి కోసం రచ్చ చేసిన శ్రీయ.. రాజేంద్రకు నిజం చెప్పిన పార్వతి.. అవనిని చంపేందుకు పల్లవి మరో ప్లాన్..
Advertisement

Intinti Ramayanam Today Episode March 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని నీకేం కాలేదు కదా అని పార్వతి కూడా కారులోంచి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది.. చక్రధర్ గారు వచ్చి నన్ను కాపాడుకున్న అంటే ఇవన్నీ నా మీద పడి నేను చచ్చిపోయేదాన్ని అని అవని భయపడిపోతూ అక్షయ్ కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది.. మెటీరియల్లిఫ్టు ఇక్కడికెల్లా వచ్చింది అని అందరూ ఆరా తీస్తూ ఉంటారు. కానీ ఆ లిఫ్ట్ ని ఆపరేట్ చేస్తున్న వ్యక్తి మాత్రం అక్కడి నుంచి పారిపోతాడు.. పల్లవి ఎక్కడ తాను దొరికిపోతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది.. చక్రధర్ పల్లవిని చూసి ఇదంతా పల్లవి ప్లాన్ అని అనుకుంటాడు..

అవనిని లేపగానే నాపై ఈ లిఫ్ట్ పడిపోతుంది అని టెన్షన్ పడుతూ అడుగుతుంది. నన్ను కాపాడారు అని అంటుంది. పక్కనే పడున్న చక్రధర్ ను చూసి నన్ను కాపాడి ఆయన పడిపోయాడు అని అందరు కంగారు పడుతూ చక్రధర్ దగ్గరకు వస్తారు. అతను స్పృహ తప్పి కింద పడిపోవడంతో అందరూ ఏమైందని భయపడిపోతూ ఉంటారు.. చక్రధాన్ని ఎంతగా లేపడానికి ప్రయత్నించినా కూడా లేవడు. కమల్ ఏమైంది వదినా అని కంగారు పడిపోతూ ఉంటాడు.. చక్రధర్ ని ఎంతగా లేపడానికి ప్రయత్నించినా సరే అతను లేవకపోవడంతో అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. అవని ఇక నాన్న లేవండి అని కంగారు పడిపోతూ బాధపడిపోతూ ఉంటుంది. నాన్న అన్న పిలుపు విన్న చక్రధర వెంటనే లేస్తాడు. చీకటిలోకి వెళ్లిపోతున్న నన్ను నాన్న అన్న పిలుపు బయటకు తీసుకొని వచ్చింది అని చక్రధర్ ఎమోషనల్ అవుతాడు. ఒక్కసారి నన్ను నాన్న అని పిలవమ్మా అని అడుగుతాడు.. అవేం మాటలు నాన్నా అని అవని అంటుంది.. ఆ ఎమోషనల్ సీన్ ఎపిసోడ్ కు హైలెట్ గా నిలుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేశ్వరికి వాటర్ తీసుకురమ్మని చెప్పగానే రాజేశ్వరి పని మనిషికి నీళ్లు ఇవ్వమని చెప్తుంది.. చుట్టాలకి ఇచ్చినట్టు ఇంట్లో వాళ్లకి ఇంటి ఓనర్ కి పనిమనిషితో ఇలా మర్యాదలు చేయించకూడదు అని చక్రధర్ సీరియస్ అవుతాడు. నా తప్పు తెలుసుకొని నేను చాలా మారిపోయాను కానీ నాకు కోపం ఆవేశం అలానే ఉన్నాయి. ఏం చేయాలో అది చేస్తాను అని చక్రధర్ అంటాడు. నీ అంతటి నువ్వు నాకు భోజనం వడ్డించేంతవరకు నేను మెతుకు కూడా ముట్టను అని చక్రధర్ భీష్మించుకుని కూర్చుంటాడు. ఆయన నా కళ్ళ ముందర చచ్చిపోయిన పర్వాలేదు కానీ నేను మాత్రం ఆయన దగ్గరికి పోను అని రాజేశ్వరి కూడా పంతం పడుతుంది. భానుమతి ఎంత చెప్పాలని చూసినా కూడా రాజేశ్వరి కూడా మొండిగా ఉండడంతో ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక పార్వతి రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్లి అవని కన్న తండ్రి ఎవరో చక్రధర్ చెప్పేసాడు అండి అని అంటుంది .

వాళ్ళిద్దరూ ఇన్ని రోజులు ఎన్నో అవమానాలు పడ్డారు ఇప్పుడు వాళ్ళ తండ్రి ఎవరో తెలిసి చాలా సంతోషంగా ఉన్నారు. అవని కూడా తన తండ్రిని నాన్న అని పిలుస్తుంది అని పార్వతి అంటుంది. ఇక భూమి పూజ గురించి చెప్పి ఈరోజు మీరు ఉంటే చాలా బాగుండేది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. పల్లవి అవనిని చంపాలని ఎంతగా ప్రయత్నించినా సరే చంపలేకపోయాను నేనే వాళ్ళిద్దరిని దగ్గర చేసినట్లు ఉంది అని బాధ పడిపోతూ ఉంటుంది.. అక్కడికి పోయిన బంధాన్ని నేనే దగ్గరుండి మళ్లీ పిలిచేలా చేశాను అని పల్లవి కోపంలో తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది. ఈసారి ఎలాగైనా సరే అవన్నీ నీ చంపేసి నా పగని తీర్చుకోవాలి అని పల్లవి అనుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చినా కమల్ ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఎంతసేపు చూసినా అద్దంలో అదే కదా కనిపించేది అని అంటాడు..

Advertisement

నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు ఒక విషయం చెప్తాను మావయ్య వదిన ఇద్దరు కలిసి పోయారు.. నువ్వు కూడా కలిసిపోతే బాగుంటుంది వదినని అక్క అని ప్రేమగా పిలిస్తే ఇంకా బాగుంటుంది అని కమల్ ఉచిత సలహాలు ఇస్తాడు. కానీ ఆ మాటకు పల్లవి మాత్రం అసలు రెస్పాండ్ అవ్వకుండా మౌనంగా ఉండిపోతుంది. నేను ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా జరిగేది జరుగుతుంది అని పల్లవి అంటుంది. పార్వతికి మాత్రలు తీసుకుని వచ్చిన అవని రాజేశ్వరి పిన్ని గారు ఇంకా పంతం వదల్లేదు అని అంటుంది. ఆమె మొండితనానికి తగ్గట్లుగా అన్నయ్యగారు కూడా ఏమి తినకుండా తను పెడితేనే తింటాను అని మొండిగా కూర్చున్నాడట. అత్తయ్య ఫోన్ చేసి చెప్పింది అని పార్వతి అంటుంది.. ఇక శ్రీయ ఇంట్లో ఏసీ లేదని పెద్ద రచ్చ చేస్తుంది. అన్నయ్య లేనిది ఏ పని చేయలేవా నువ్వు అని శ్రీకర్ని దారుణంగా తిట్టేస్తుంది..

Also Read :వంటలక్క గురించి ఎవరికి తెలియని టాప్ సీక్రెట్.. ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కే ..!

అవని తన తండ్రికి భోజనం తీసుకుని వెళ్లి ప్రేమగా వడ్డించాలని అనుకుంటుంది. ఏంటమ్మా నువ్వు ఈ టైంలో అల్లుడుగారు వచ్చారా ఏంటి అని అడుగుతాడు చక్రధర్.. లేదు నాన్నా మీరు భోజనం చేయలేదని అన్నారు అందుకే నేను నా చేతులతో నేను వండి తీసుకొని వచ్చాను అని అవని అంటుంది. మీ పిన్ని ఎంత మొండిగా ఉందో మారడం లేదు అని చక్రధర కూడా అంటాడు. పిన్నికి మీరంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిమ్మల్ని జైలు నుంచి తీసుకురాలేదని నన్ను ఆయన్ని రోజు వచ్చి తిట్టేది మీ మీద అంత ప్రేమ ఉంది అని అవని అంటుంది. తను మొండిగా ఉంది ఎప్పుడు మారుతుందో అర్థం కావడం లేదు అని చక్రధర్ బాధపడతాడు. సరే నాన్న మీరు అవన్నీ పక్కన పెట్టేసేయండి టైం కి తిని మందులు వేసుకోవాలి కదా అందుకే మీకు నేను భోజనం తీసుకొచ్చాను అని అవని అంటుంది.. ఇక తన తండ్రికి గోరుముద్దలు పెడుతుంది అవని ఆ సీన్ ఎపిసోడ్ కి హైలైట్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Big Stories

Advertisement
×