Asia Cup Rising Stars 2025: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ లో ( ACC Mens Asia Cup Rising Stars 2025) పాకిస్తాన్ A ( Pakistan A ) ఛాంపియన్ గా నిలిచింది. ఎవరు ఊహించని విధంగా ఫైనల్ దాకా వచ్చిన పాకిస్తాన్ A, చివరికి టైటిల్ దక్కించుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ A జట్టును ( Bangladesh A ) చిత్తు చేసి, విజయం సాధించింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. అయితే సూపర్ ఓవర్ లో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ A టైటిల్ ఎగురేసుకు వెళ్ళింది. ఈ సూపర్ ఓవర్ లో ( super over ) మొదట బంగ్లాదేశ్ A బ్యాటింగ్ చేసి 6 పరుగులు సాధించింది. అనంతరం 7 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ A చాలా ఆచితూచి ఆడింది. ఈ తరుణంలోనే, వికెట్ నష్టపోకుండా పాకిస్తాన్ A విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో పాకిస్తాన్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి. అటు టైటిల్ గెలిచిన తర్వాత మెస్సి, రోహిత్ తరహాలోనే స్లో వాకింగ్ చేసుకుంటూ, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 ట్రోఫీని అందుకున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్. ఈ వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.
ఆసియా కప్ పురుషుల రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ ఫైనల్ లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh A vs Pakistan A, Final) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లు ఆడిన పాకిస్తాన్ A జట్టు, 125 పరుగులకు కుప్పకూలింది. దీంతో బంగ్లాదేశ్ కచ్చితంగా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే చివరి వరకు పోరాడిన బంగ్లాదేశ్, ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ లాగానే 9 వికెట్లు నష్టపోయి 125 పరుగులు సాధించింది. దీంతో మ్యాచ్ డ్రా కావడం, ఆ తర్వాత సూపర్ ఓవర్ దాకా వెళ్లడం జరిగింది. సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 6 పరుగులు చేయగా, ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్ అవలీలగా ఛేదించింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ 2025 రైజింగ్ స్టార్స్ టోర్నమెంటును గెలుచుకుంది పాకిస్తాన్.
ఆసియా కప్ పురుషుల రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ ఫైనల్ లో గెలిచిన పాకిస్తాన్ కు దాదాపు రూ.2.6 కోట్లు దక్కనుంది. అటు రన్నరప్ జట్టు బంగ్లాదేశ్ కు రూ.1.7 కోట్లు దక్కనుంది.
WE ARE GOING TO A SUPER OVER!!!!! pic.twitter.com/Ard7eISluH
— PCT Replays 2.0 (@ReplaysPCT) November 23, 2025
Irfan Khan Niazi’s Messi-style walk. pic.twitter.com/YEEk7jquZZ
— junaiz (@dhillow_) November 23, 2025