Mayank Yadav – Sanjeev: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament )… పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో… లక్నో సూపర్ జేయింట్స్ స్టార్ బౌలర్ మయాంక్ యాదవ్ సీక్రెట్ లవ్ స్టోరీ బయట పడింది. గాయాల పేరుతో అమ్మాయితో… పార్టీలు అలాగే పబ్బులకు లక్నో బౌలర్ మాయాంక్ యాదవ్ ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో మీమ్ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియో… ఇప్పుడు వైరల్ చేస్తూ లక్నో బౌలర్ మాయాంక్ యాదవ్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు.
Also Read: MS Dhoni: MS ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ఇప్పుడే అసలు గౌరవం
మహిళ క్రికెటర్ తో సహజీవనం.. మయాంక్ యాదవ్ పై ట్రోలింగ్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… గాయం కారణంగానే మధ్యలోనే మయాంక్ యాదవ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా… మాయాంక్ యాదవ్ మధ్యలోనే వైదొలిగాడు. అప్పుడు కూడా గాయం పేరుతో… రెస్ట్ తీసుకున్నాడు మయాంక్ యాదవ్ ( Mayank yadav). అయితే ఈ 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సమయంలో… కూడా మయాంక్ యాదవ్ కు గాయం అయింది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ…. ఐపీఎల్ టోర్నమెంట్ మధ్యలోనే మయాంక్ యాదవ్ వైదొలిగాడు.
అయితే అతడు గాయం కారణంగా వైదొలగలేదని… మహిళ క్రికెటర్ తో రిలేషన్ లో ఉన్న నేపథ్యంలో…. ఆమెతో తిరుగుతున్నట్లు ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రేయాంకా పాటిల్ అనే మహిళా క్రికెటర్ తో మయాంక్ యాదవ్…. సహజీవనం చేస్తున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Women’s Premier League 2025 Tournament ) సమయంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు సపోర్ట్ చేస్తూ స్టేడియానికి వచ్చారు. ఆ సమయం నుంచే వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( ipl 2025 ) ప్రారంభమైన తర్వాత గాయం పేరుతో ఆమె కోసం మధ్యలోనే వైదొలిగినట్లు చెబుతున్నారు.
క్లాస్ పీకిన లక్నో ఓనర్ సంజీవ్
గాయం పేరుతో గేమ్స్ ఆడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి మధ్యలోనే వైదొలిగిన మయాంక్ యాదవ్… అసలు విషయం బయటకు రావడంతో… లక్నో ఓనర్ సంజీవ్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్లు వస్తున్నాయి. నీకు ఏడాదికి 11 కోట్లు ఇస్తే.. అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నావా? క్రికెట్ ఆడటం చేతకాకపోతే… వెళ్ళిపో అంటూ మాయాంక్ యాదవ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట లక్నో ఓనర్ సంజీవ్. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Also Read: Tino Best: 650 మంది మహిళలతో శృ***గారం.. ఆ వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్ అరాచకాలు
?igsh=ODVicDZrdXJvcXlp