Skin Fast Ageing| మీరు స్టైలిష్‌గా ఉంటారు. ట్రెండీ ఫ్యాషన్ దుస్తులు ధరిస్తారు. కానీ అద్దంలో మీ ముఖం చూసుకుంటే త్వరగా ముడతలు బారుతుంటుంది. యవ్వనంగా కనిపించడం అదృష్టంపై కాదు, మీ రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ చిన్న అలవాట్లు మీ చర్మాన్ని నిశ్శబ్దంగా వృద్ధాప్యం చేస్తాయి. ఈ 7 అలవాట్లను మార్చుకుంటే మీ చర్మం యవ్వనంగా మెరుస్తుంది.
1. తక్కువ నిద్ర, ఎక్కువ ఒత్తిడి
రాత్రిపూట తక్కువ నిద్ర, రోజంతా ఒత్తిడి మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. నిద్రలో మీ శరీరం చర్మాన్ని రిపేర్ చేస్తుంది, హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. నిద్రలేమి వల్ల చర్మం డల్‌గా, కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌తో కనిపిస్తుంది. ఒత్తిడి.. కార్టిసాల్ అనే హాని కలిగించే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి చేసి.. చర్మంలోని కొలాజన్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా ముడతలు త్వరగా వస్తాయి. రోజూ 7-8 గంటలు నిద్రపోండి.
2. సన్‌స్క్రీన్ వాడకపోవడం
సూర్య కిరణాలు (UV రేలు) చర్మానికి అతిపెద్ద శత్రువు. ఇవి కొలాజన్‌ను నాశనం చేసి, మచ్చలు, ముడతలు తెస్తాయి. బయటకు వెళ్లకపోయినా, కిటికీల గుండా కిరణాలు చర్మాన్ని చేరతాయి. ప్రతి రోజూ SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ రాసుకోండి. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
3. అధికంగా మద్యం సేవించడం.. నీరు తక్కువగా తాగడం
మద్యం చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. నిద్రను భంగం చేస్తుంది, ముడతలను తెస్తుంది. నీరు తక్కువ తాగితే చర్మం పొడిబారి, డల్‌గా కనిపిస్తుంది. రోజూ 8 గ్లాసుల నీరు తాగండి, మద్యాన్ని తగ్గించండి. మీ చర్మంలో 64 శాతం నీరు ఉంటుంది. కాబట్టి నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం.
4. సరైన చర్మ సంరక్షణ లేకపోవడం
ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగినా అన్నిసార్లు సరైన ఫలితం కనిపించకపోవచ్చు. పైగా సబ్బు తరుచూ వాష్ చేసుకుంటే చర్మం పొడిబారుతుంది. అందుకే క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడండి. వారంలో రెండుసార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయండి. గడ్డం ఉంటే దాన్ని క్లీన్‌గా, ట్రిమ్‌గా ఉంచండి.
5. అధిక చక్కెర తీసుకోవడం
ఎప్పుడో ఒకసారి స్వీట్ తినడం సమస్య కాదు, కానీ రోజూ చక్కెర తీసుకుంటే చర్మం త్వరగా ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. చక్కెర.. కొలాజన్, ఎలాస్టిన్‌లను దెబ్బతీస్తుంది. ముడతలు.. చర్మాన్ని వదులుగా చేస్తాయి. సోడా డ్రింక్స్, కూల్ డ్రింక్స్, గ్రానోలా బార్లలలో చక్కెర ఉంటుంది కాబట్టి.. వీటిని తినడం బాగా తగ్గించి.. పండ్లు, గింజలు తినండి.
6. వ్యాయామం చేయకపోవడం
వ్యాయామం చేయకపోతే చర్మానికి ఆక్సిజన్, పోషకాలు అందవు. రక్తప్రసరణ తగ్గి, ముఖం డల్‌గా కనిపిస్తుంది. రోజూ నడక, యోగా లేదా స్కిప్పింగ్ వంటి సాధారణ వ్యాయామం చేయండి. ఇది ముడతలను తగ్గించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
Also Read: ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా?.. ఇవి తింటే మీ సమస్య మటుమాయం..
7. విటమిన్ల కొరత
మీ ఆహారంలో విటమిన్ సి, డి, జింక్, ఒమేగా-3 లేకపోతే చర్మం పొడిబారి, నీరసంగా కనిపిస్తుంది. ఆకుకూరలు, సిట్రస్ పండ్లు, చేపలు, గింజలు తినండి. అవసరమైతే మల్టీవిటమిన్ తీసుకోండి. విటమిన్ సి మచ్చలను తగ్గించి, చర్మాన్ని సమానంగా చేస్తుంది.