Tino Best: క్రికెట్ చరిత్రలో… చాలామంది స్టార్లు ఉన్నారు. ఇందులో కొంతమంది అరుదైన రికార్డులు సాధిస్తే మరి కొంతమంది.. తమ కెరీర్ లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. మరి కొంతమంది కెరీర్ లో సక్సెస్ అయి.. అమ్మాయిల మోజులో పడి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అయితే అచ్చం ఇలా అమ్మాయిల మోజులో పడిన క్రికెటర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ టినో బెస్ట్ ( Tino Best). అతని ఆత్మకథలో రాసుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో షాకింగ్ నిజాలను టినో బెస్ట్ వెల్లడించారు.
Also Read: Wasim Akram: హైదరాబాద్‌లో వసీం అక్రమ్ విగ్రహం.. పగలబడి నవ్వుతోన్న జనం, ఎందుకంటే?
500 మంది మహిళలతో గడిపిన టినో బెస్ట్
వెస్టిండీస్ దిగ్గజా మాజీ క్రికెటర్ టినో బెస్ట్.. ఒకప్పుడు ప్రమాదకరమైన ఆటగాడిగా కొనసాగారు. 2003 సంవత్సరం నుంచి 2014 వరకు వెస్టిండీస్ జట్టులో కీలక ప్లేయర్గా.. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా టినో బెస్ట్ రికార్డులోకి ఎక్కాడు. వెస్టిండీస్ జట్టులో… బెస్ట్ ఆల్ రౌండర్ గా టినో బెస్ట్ కొనసాగాడు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్ అలాగే రైట్ ఆర్మ్ బౌలింగ్ తో… తన కెరీర్ కొనసాగించాడు. అయితే అలాంటి.. టినో బెస్ట్ తన మొత్తం కెరియర్లో 100 మ్యాచ్లు కూడా ఆడలేక పోయాడు. అందులోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో వెస్టిండీస్ జట్టులో ఛాన్సులు ఎక్కువగా దక్కించుకోలేక తన కెరీర్… ముగించేశాడు.
అయితే వెస్టిండీస్ కు ప్రాతినిధ్యం వహించిన టినో బెస్ట్ తన పర్సనల్ లైఫ్ లో మాత్రం బాగా ఎంజాయ్ చేసినట్లు ఆత్మకథలో వివరించాడు. తన క్రికెట్ చరిత్ర పైన అలాగే పర్సనల్ లైఫ్ గురించి ఈ ఆత్మకథ రాసుకున్నాడు వెస్టిండీస్ ఆటగాడు బెస్ట్. ఇందులో శారీరకంగా సుఖపడ్డ అంశాలను కూడా వివరించాడు. తన ఆత్మకథ ప్రకారం… 500 నుంచి 650 మంది అమ్మాయిలతో శారీరకంగా దగ్గరైనట్లు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ టినో బెస్ట్ స్పష్టం చేశాడు. వాళ్లందరితో ఎంజాయ్ చేసి లైఫ్.. అంటే ఏంటో చూసానని వెల్లడించాడు.
అమ్మాయిలు అంటే నాకు మోజు!
అమ్మాయిలంటే తనకు ఎంతో ఇష్టమని.. అందుకే ఎంతమంది దొరికితే అంతమందితో ఎంజాయ్ చేశానని ఆత్మకథలో స్పష్టం చేశాడు టినో బెస్ట్. ప్రపంచంలోనే అందమైన బట్టతల ఉన్న మనిషిని నేనే అని అనుకుంటున్నట్లు… కూడా వివరించాడు. తన భార్యతో విడిపోయిన తర్వాత నేను ప్లే బాయ్ గా మారిపోయానని చెప్పుకొచ్చాడు. క్రికెటర్ గా ఎక్కడికి వెళ్లినా అమ్మాయిలతో మాట్లాడేవాడిని.. వాళ్లతో గడిపే వాడిని అంటూ స్పష్టం చేశాడు. నేను అమ్మాయితో మాట్లాడితే కచ్చితంగా వాళ్ళు.. తనతో గడపాల్సిందేనని.. అలాంటి మ్యాజిక్ తన దగ్గర ఉందని ఆత్మకథలో వివరించాడు టినో బెస్ట్.
Also Read: MS Dhoni: MS ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ఇప్పుడే అసలు గౌరవం
?igsh=dm4ydTVjZ2t6d2xx