BigTV English

MS Dhoni: MS ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు.. ఇప్పుడే అసలు గౌరవం

MS Dhoni:  MS ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు.. ఇప్పుడే అసలు గౌరవం

MS Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కడం జరిగింది. మహేంద్రసింగ్ ధోని కి హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు దక్కింది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్… హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాను ప్రకటించడం జరిగింది. అయితే ఈ లిస్టులో మహేంద్రసింగ్ ధోని పేరు ఉండడం గమనార్హం. మొత్తం ఏడుగురు ప్రముఖ మాజీ క్రికెటర్లు ఉండగా అందులో మహేంద్రసింగ్ ధోని ఉన్నారు.


Also Read:Rohit’s Lamborghini: రోహిత్ శర్మకు అవమానం…గిఫ్ట్ గా ఇచ్చిన కారును అమ్ముకున్న ఫ్యాన్ June 9,2 

టీమిండియా కు మూడు ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు


మహేంద్ర సింగ్ ధోని టీమిండియా లోకి వచ్చిన తర్వాత జట్టు స్వరూపం పూర్తిగా మారిపోయింది. 2007 సంవత్సరంలో జరిగిన మొట్టమొదటి టి20 వరల్డ్ కప్ సమయంలోనే టీమ్ ఇండియాకు కెప్టెన్ గా ఎంపికయ్యారు మహేంద్రసింగ్ ధోని. అప్పటినుంచి టీమిండియా వరుస విజయాలను నమోదు చేసుకుంటూ దూసుకు వెళ్ళింది. ఆ సమయంలోనే యంగ్ స్టార్లను జట్టులోకి తీసుకువచ్చి… సీనియర్లకు షాక్ ఇచ్చారు మహేంద్రసింగ్ ధోని. సీనియర్లను బయటకు పంపిస్తేనే కెప్టెన్సీ తీసుకుంటానని కండిషన్ పెట్టడంతో మహేంద్రసింగ్ ధోని మాటను కూడా దాటలేకపోయింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

దానికి తగ్గట్టుగానే 2007 సంవత్సరంలో జరిగిన టి20 వరల్డ్ కప్…ను టీమిండియా కు అందించాడు మహేంద్ర సింగ్ ధోని. చాలా ప్రశాంతంగా ఉంటూనే… ఎత్తులకు పై ఎత్తులు వేసే మహేంద్ర సింగ్ ధోని.. పాకిస్తాన్ పైన విజయం సాధించి 2007 వరల్డ్ కప్ తీసుకువచ్చాడు. ఆ తర్వాత 2011 సంవత్సరంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ను కూడా టీమిండియా కు తీసుకువచ్చిన ఘనత మహేంద్రసింగ్ ధోని ఖాతాలో ఉంది. ఇక చాంపియన్స్ ట్రోఫీ 2013 కూడా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ లోనే… టీమిండియా కు రావడం జరిగింది. ఇలా వరుసగా మూడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన టోర్నమెంటులలో టీమిండియాను చాంపియన్గా నిలిపిన ఏకైక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కూడా ఐదు సార్లు చాంపియన్గా నిలిపాడు మహేంద్రసింగ్ ధోని. ఈ నేపథ్యంలోనే మహేంద్ర సింగ్ ధోనీకి తాజాగా హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో స్థానం దక్కింది. ధోనితో పాటు మరో ఏడుగురు ఉన్నారు. ఇందులో ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ డేంజర్ ఆటగాడు హేడెన్, దక్షిణాఫ్రికా ఆటగాడు హసిం ఆమ్లా ఉన్నారు.

Also Read: Luckiest Batter: అదృష్టమంటే ఇదే…వికెట్లను తాకినా నాటౌటే.. అది కూడా 98 పరుగుల వద్ద

ధోని అరుదైన రికార్డులు

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో మహేంద్ర సింగ్ ధోని చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తన అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో… ఇప్పటివరకు 538 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 17266 పరుగులు చేయడం జరిగింది. 829 మందిని డిస్మిస్ చేశాడు. ఇక మహేంద్రసింగ్ ధోనితోపాటు హెడేన్, వెటోరి, గ్రేమ్ స్మిత్, హాసిం ఆమ్లా కు అవకాశం దక్కింది. మహిళల క్రికెట్ లో సారా టేలర్, సనా మీర్ కు అవకాశం దక్కింది.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×