జగన్ నా ప్రాణం, జగన్ నా దేవుడు.. ఇది ఓకే
కట్టె కాలేవారకూ జగన్ తోనే, జగనన్న వెంటే.. అందరూ కామన్ గా చెప్పే డైలాగులివి
నా గుండె లబ్ డబ్ అని కాదు, జగన్ జగన్ అని కొట్టుకుంటుంది.. ఇది కాస్త ఓవర్
ఇంతకంటే అతి ఇంకేమీ ఉండదు అని మీరనుకుంటే పొరపాటే. జగన్ గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే ఆయన దగ్గర అంత పలుకుబడి ఉంటుంది అనుకున్నారేమో.. ఆమధ్య మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీడీపీ అభిమానులు గోరంట్ల కామెంట్స్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకీ గోరంట్ల ఏమన్నారు..?
“మాజీ సీఎం జగన్ ని మనం నిశితంగా, క్షుణ్ణంగా గమనిస్తే..
ఒక తరిమెళ్ల నాగిరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి, బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే.. ఈ నలుగుర్ని తీసుకొచ్చి ఒక రోట్లో వేసి, రోకలి బండతో మెత్తగా దంచి దాన్నుంచి మనం తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చారేమో అనిపిస్తుంది.” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు గోరంట్ల మాధవ్. మీ మానసిక పరిస్థితి బాగానే ఉందా, పిచ్చి పీక్స్ లోకి వెళ్తున్నట్టుంది కదా అంటూ సదరు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు.. ఎస్, నేను బాగానే ఉన్నానంటూ మరింత రెట్టించి సమాధానం ఇచ్చారు మాజీ ఎంపీ. ఈ వ్యాఖ్యలకు సినిమా క్లిప్ లు జోడించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
🤣🤣🤣🤣 pic.twitter.com/iwjCb2RqNG
— Yash (@YashTDP_) June 11, 2025
2019లో గోరంట్ల మాధవ్ కి వైసీపీ టికెట్ ఇవ్వలేదు. అప్పుడే ఆయన పార్టీ ఫిరాయిస్తారేమో అనుకున్నారు కానీ, బయట ఎవరూ ఆయన్ను జాయిన్ చేసుకోడానికి రెడీగా లేరు కాబట్టి ఆయన వైసీపీకే పరిమితం అయ్యారు. తనను దూరం పెట్టిన జగన్ కు ఆయన మరంత దగ్గరవడానికి ఇలా రెచ్చిపోయారు. జగన్ వీరుడు, శూరుడు, దేవుడు అని పొగడటం సహజమే. అందుకే ఆయన కొత్త పంథా ఎంచుకున్నారు. పోనీ జగన్ లో తరిమెళ్ల నాగిరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి, అంబేద్కర్, పూలే వంటి మేథావుల లక్షణాలు ఉన్నాయి అని చెబితే సరిపోయేది. కానీ గోరంట్ల మాత్రం పిచ్చ కామెడీ చేశారు. ఆ నలుగుర్ని రోట్లో వేసి దంచాలన్నారు. ఆ సారం తీస్తే అదే జగన్ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ నలుగురి ప్రతిరూపమే జగన్ అని చెప్పినా పర్లేదు కానీ.. ఆ నలుగురిని రోట్లో వేసి రోకలి బండతో దంచాలి అని చెప్పడం మాత్రం పిచ్చి పీక్స్ కి వెళ్లడమే అనుకోవాలి.
జగన్ ఓ రాజకీయ నాయకుడు 2014లో ఓడిపోయారు, 2019లో గెలిచారు, 2019లో ప్రజల్లు ఆయన్ను తిరస్కరించారు. ఏపీ చరిత్రలో ఓ ప్రతిపక్షం ఇన్ని తక్కువ సీట్లకు పరిమితం కావడం ఇదే తొలిసారి అనేలా జగన్ పతనం ఉంది. మరి ఆ నలుగురి సారాన్ని పిండితే జగన్ వచ్చాడని అనుకుంటే.. ప్రజలు ఆయన్ను అంత ఘోరంగా తిరస్కరిస్తారా..? కేవలం 11 సీట్లకే పరిమితం చేసి, కనీసం ప్రతిపక్ష నాయకుడు అనే హోదా కూడా లేకుండా చేస్తారా..? అంత ఘోర పరాభవం జరిగినా ఇంకా వైసీపీ నేతలు ఏమాత్రం తగ్గడంలేదు. జనాల్లోకి వెళ్తే సీఎం సీఎం అంటూ కార్యకర్తలు గోల గోల చేస్తుంటారు. చుట్టూ ఉన్న నేతలేమో.. దేవుడు, దేవుడికి మించి అంటూ పొగుడుతుంటారు. ఇలాంటి వారందర్నీ చుట్టూ పెట్టుకుని జగన్ అసలు వాస్తవాలు ఎలా తెలుసుకుంటారు..? తప్పుల్ని ఎలా సరిదిద్దుకుంటారు..? వేచి చూడాలి.