E-Paper
Advertisement

MI VS RR: ఛీటింగ్ చేసిన‌ శార్దుల్ ఠాకూర్.. రాజ‌స్థాన్ కు తీవ్ర అన్యాయం, ఏకంగా ఖ‌ర్చీఫ్ పెట్టి

MI VS RR: ఛీటింగ్ చేసిన‌ శార్దుల్ ఠాకూర్.. రాజ‌స్థాన్ కు తీవ్ర అన్యాయం, ఏకంగా ఖ‌ర్చీఫ్ పెట్టి
Advertisement

MI VS RR:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది. రేపటి నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు కూడా ప్రారంభం కానున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నిన్న లీగ్ దశలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians vs Rajasthan Royals) మధ్య ఫైట్ జరిగింది. ఇందులో తప్పక గెలవాల్సిన రాజస్థాన్ రాయల్స్… 30 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. దీంతో ప్లే ఆఫ్ కు చేరుకొని, పంజాబ్ కింగ్స్ ను ఇంటికి పంపించింది. అయితే ముంబై తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కు తీవ్ర అన్యాయం జరిగింది. ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur ) ఛీటింగ్ చేసిన‌ట్లు వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఖర్చీఫ్ కిందపడేసి బంతి సంధించాడు. ఈ క్రమంలో డిస్టర్బ్ అయిన బ్యాటర్ శుభమ్ దూబే (Shubham Dubey) క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే దీనిపై రాజస్థాన్ రాయల్స్ కోచ్ సంగాక్కర ( Kumara sangakkara) అంపైర్ తో గొడవ పెట్టుకున్నప్పటికీ కూడా ఔట్ గానే ప్రకటించారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

ఛీటింగ్ చేసిన‌ శార్దుల్ ఠాకూర్

Advertisement

ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Mumbai Indians vs Rajasthan Royals) మధ్య నిన్న వాంఖడే స్టేడియం వేదికగా ( Wankhede Stadium, Mumbai) జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయ‌ల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించేందుకు ముంబై బౌలర్ శార్దుల్ ఠాకూర్ చీటింగ్ చేశాడు. చివరలో శుభం దూబే ( Shubham Dubey) బ్యాటింగ్ కు వచ్చిన క్రమంలో.. బౌలింగ్ చేస్తుండగానే తన ఖర్చీఫ్‌ కింద పడేశాడు శార్దుల్ ఠాకూర్. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన శుభం దూబే డిస్టర్బ్ అయ్యాడు. ఆ త‌ర్వాత నమ‌న్ ధీర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

అయితే ఈ సంఘటన చూసిన వెంటనే రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర… రంగంలోకి దిగాడు. అది నాటౌట్ అని.. సీరియస్ అయ్యారు. ఫోర్త్ అంపైర్ తో గొడవ పెట్టుకున్నారు కుమార సంగక్కర ( Kumar Sangakkara ). ఈ క్రమంలోనే మరోసారి పరిశీలించిన అంపైర్లు.. రాజస్థాన్ రాయల్స్ కు షాక్ ఇచ్చారు. శార్దుల్ ఠాకూర్ కావాలని ఖ‌ర్చీఫ్ వేయలేదని… అనుకోకుండా కింద పడిందని అంపైర్లు వెల్లడించారు. రూల్స్ ప్రకారం ఇది ఔట్ అంటూ కుండబద్దలు కొట్టి చెప్పారు. దీంతో ఈ వివాదం రాజుకుంది. అయితే ఫైనల్ గా రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. లేకపోతే ఈ అంశం మరింత వివాదంగా మారేది.

Advertisement

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×