E-Paper
Advertisement

Mitchell and Cameron:ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు.. ఇక భారత్‌కు కంగారేనా?

Mitchell and Cameron:ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు.. ఇక భారత్‌కు కంగారేనా?
Advertisement

Mitchell and Cameron:బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టుకు గుడ్‌న్యూస్‌. గాయాల కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమైన స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌, విధ్వంసకర ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్… చివరి రెండు టెస్టులకు అందుబాటులోకి రాబోతున్నారు. ఇప్పటికే గాయాల కారణంగా స్టార్‌ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ చివరి రెండు టెస్టులకు దూరం కావడంతో డీలా పడ్డ ఆస్ట్రేలియా జట్టు… మిచెల్‌, కామెరాన్ రాబోతున్నారని తెలియగానే… పట్టరాని ఆనందంలో మునిగిపోయింది. మిగతా టెస్టుల్లో భారత్ భరతం పడతామని ధీమా వ్యక్తం చేస్తోంది.

మూడో టెస్టులో పలు మార్పులతో బరిలోకి దిగబోతోంది… ఆసీస్‌. ఆఖరి రెండు టెస్టులకు ఆ జట్టు కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌ వ్యవహరించబోతున్నాడు. స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌… విధ్వంసకర ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్ మూడో టెస్టుకే అందుబాటులో రాబోతున్నారు. గాయాల కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమైన ఈ ఇద్దరు ఆటగాళ్లు… పూర్తి ఫిట్‌నెస్‌ సాధించారని ఆసీస్‌ హెడ్‌ కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ సృష్టం చేశారు.

Advertisement

దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ సందర్భంగా కామెరాన్ గ్రీన్ చేతి వేలికి గాయమైంది. అయినా జట్టుతో కలిసి భారత్‌ చేరుకున్న గ్రీన్… బెంగళూరులో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. తాజాగా అతను నెట్స్‌లో బౌలింగ్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నాడని చెబుతున్నారు. దాంతో… చివరి రెండు టెస్టులకు అతణ్ని పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకోవాలని ఆసీస్‌ టీమ్ మేనెజ్‌మెంట్‌ భావిస్తోంది. నిరుడు భారత్‌లోనే జరిగిన టీ-20 సిరీస్‌లో గ్రీన్‌ అద్భుతంగా రాణించాడు. దాంతో ఐపీఎల్‌-2023 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడిని ఏకంగా రూ.17 కోట్లకు ​కొనుగోలు చేసింది. ఇక మిచెల్ స్టార్క్ రాకతో… పేస్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారుతుందని ఆసీస్ నమ్మకంగా ఉంది. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్‌లో జరగనుంది.

Sania Mirza : టెన్నిస్ కు సానియా గుడ్ బై.. కెరీర్ సాగింది ఇలా.. రికార్డులెన్నో..

Advertisement

Virat Kohli: విరాట్ కోహ్లీకి పబ్లిక్‌గా లిప్ టూ లిప్ కిస్ పెట్టిన యువతి.. వీడియో వైరల్

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×