BigTV English

Tax:ఎంత ట్యాక్స్ కట్టాలో సింపుల్‌గా తెలుసుకోండి..

Tax:ఎంత ట్యాక్స్ కట్టాలో సింపుల్‌గా తెలుసుకోండి..

Tax:మీరు ఆదాయ పన్ను చెల్లింపుదారులా? పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది ఎంచుకోవాలో అర్థంకాక తికమక పడుతున్నారా? ఏది ఎంచుకుంటే పన్ను తక్కువ పడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ కోసం ట్యాక్స్ కాలిక్యులేటర్‌ను తన పోర్టల్లో అందుబాటులోకి తెచ్చింది… ఆదాయపు పన్ను శాఖ. జస్ట్… కొన్ని క్లిక్స్ చేస్తూ.. వివరాలు నమోదు చేసుకుంటూ వెళ్తే చాలు.. పాత విధానంలో ఎంత పన్ను పడుతుంది? కొత్త విధానంలో ఎంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది? ఏ విధానం ఎంచుకుంటే ఎంత మొత్తం ఆదా అవుతుంది? అన్న వివరాలు ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ఆప్షన్ ద్వారా పూర్తిగా తెలిసిపోతాయి.


ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ‘క్విక్‌ లింక్స్‌’ ఆప్షన్లలో ఒకటిగా కనిపిస్తుంది… ‘ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కాలిక్యులేటర్‌’. దానిపై క్లిక్‌ చేస్తే బేసిక్‌ కాలిక్యులేటర్‌, అడ్వాన్స్‌డ్ కాలిక్యులేటర్‌ అనే రెండు ఆప్షన్లతో ఓ పేజీ ఓపెన్ అవుతుంది. వాటి ద్వారా ఏ విధానంలో ఎంత పన్ను చెల్లించాలో తెలుసుకోవచ్చు. బేసిక్‌ కాలిక్యులేటర్‌లో అసెస్‌మెంట్‌ ఇయర్‌, పన్ను చెల్లించే వ్యక్తి కేటగిరీ, వయసు, నివాస స్థితి వంటి ఆప్షన్లు ఎంచుకుని… వార్షికాదాయం, మొత్తం మినహాయింపులు నమోదు చేస్తే… పాత, కొత్త విధానాల్లో ఎంత పన్ను పడుతుందో కుడివైపు పట్టికలో కనిపిస్తుంది. అందులోనే… ఏ విధానం ఎంచుకుంటే ఎంత మొత్తం మిగులుతుందో కూడా కనిపిస్తుంది.

ఇక అడ్వాన్స్‌డ్ కాలిక్యులేటర్‌ ద్వారా… చెల్లించాల్సిన పన్నును వివరంగా లెక్కించవచ్చు. ఈ విధానంలో ముందుగా పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది ఎంచుకుంటారో చెప్పాలి. ఆ తర్వాత అసెస్‌మెంట్‌ ఇయర్‌, పన్ను చెల్లించే వ్యక్తి కేటగిరి, వయసు, నివాస స్థితి వంటి వాటిని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత జీతం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు… ఇల్లు లేదా మూలధనం లేదా ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే ఆయా పట్టికలపై క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పన్ను ఆదా పెట్టుబడులు, ఇతర మినహాయింపులకు సంబంధించిన వివరాలను ‘డిడక్షన్‌’ కింద కనిపించే ‘ప్రొవైడ్‌ ఇన్‌కమ్‌ డీటెయిల్స్‌’పై క్లిక్‌ చేసి నమోదు చేయాలి. కొత్త పన్ను విధానంలో డిడక్షన్లు వర్తించవు కాబట్టి సంబంధిత మొత్తాన్ని ఎంటర్‌ చేసే అవకాశం ఉండదు. పాత పన్ను విధానంలో మాత్రం కొన్ని సెక్షన్ల కింద మినహాయింపులు కనిపిస్తాయి. వాటిని నేరుగా నమోదు చేయవచ్చు. ఇంకా మినహాయింపులు ఉంటే, ‘ఎంటర్‌ డిడక్షన్‌’, ‘యాడ్‌ డిడక్షన్‌’ ఆప్షన్లలో ఎంటర్‌ చేసి… ఎంత పన్ను పడుతుందో లెక్కించవచ్చు. ఏ విధానం ద్వారా డబ్బు ఆదా అవుతుందో.. దాని ద్వారా రిటర్నులు ఫైల్‌ చేయవచ్చు.


Gold Rates : నేడు బంగారం ధరలు ఎంత తగ్గాయంటే..?

CRED Vs CheQ:CREDకు పోటీగా CheQ.. ఏది బెటరంటే?

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×