E-Paper
Advertisement

Mitchell Starc: వ‌సీం అక్ర‌మ్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్టార్క్‌.. ఏకంగా 415 వికెట్ల‌తో

Mitchell Starc: వ‌సీం అక్ర‌మ్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్టార్క్‌.. ఏకంగా 415 వికెట్ల‌తో
Advertisement

Mitchell Starc: యాషెస్ సిరీస్ 2025 – 26 లో భాగంగా ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటి టెస్ట్ లో ట్రావీస్ హెడ్ చెలరేగడంతో రెండు రోజులలోనే ఆట ముగిసింది. దీంతో ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 తో ముందంజలో ఉంది.

Also Read: Irfan Pathan: జ‌డేజా చేత‌కానీ త‌నం వ‌ల్లే టీమిండియా ఓట‌మి.. ఇక రిటైర్మెంట్ తీసుకో !

Advertisement

అయితే రెండువ టెస్ట్ లో గెలిచి సిరీస్ ని సమం చేయాలని ఇంగ్లాండ్ జట్టు పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో గురువారం రోజు బ్రిస్ బెన్ వేదికగా రెండవ టెస్ట్ ప్రారంభమైంది. ఈ రెండవ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

 

చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్:

Advertisement

ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య బ్రిస్ బెన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ లో.. ఆస్ట్రేలియా స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్, పాకిస్తాన్ దిగ్గజం వసీమ్ అక్రమ్ రికార్డును బద్దలు కొట్టాడు. నేడు జరుగుతున్న టెస్ట్ లో హ్యరి బ్రూక్ వికెట్ తీయడంతో స్టార్క్ ఖాతాలో ఈ రికార్డు నమోదయింది. వసీమ్ అక్రమ్ 104 టెస్ట్ లలో 414 వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్ 102వ టెస్ట్ లోనే ఈ ఘనత సాధించాడు. ఇక వసీం అక్రమ్ బౌలింగ్ సగటు 23.62 ఉండగా.. స్టార్క్ బౌలింగ్ సగటు 26.54 గా ఉంది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల టాప్ ఫైవ్ లిస్ట్ లో ప్రస్తుతం స్టార్క్ 415 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా.. వసీమ్ అక్రమ్ 414 తో రెండవ స్థానం, చమిందా వాస్ 355 వికెట్లతో మూడవ స్థానం, బౌల్ట్ 317 వికెట్లతో నాలుగవ స్థానం, జహీర్ ఖాన్ 311 వికెట్లతో 5వ స్థానంలో నిలిచారు.

Also Read: Virat Kohli: సిక్స్ గేట్ ద‌గ్గ‌ర య‌శ‌స్వి అదిరిపోయే క్యాచ్‌.. కోహ్లీ ఎలా ఏడిపించాడో చూడండి

 

తడబడుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు:

బ్రిస్ బెన్ వేదికగా ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య మొదలైన ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే వారి సంతోషాన్ని స్టార్క్ ఎక్కువసేపు మిగల్చలేదు. ఓపెనర్ బెన్ డకెట్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి తొలి ఓవర్ చివరి బంతికి స్టార్క్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తరువాత మూడవ ఓవర్ లో పోప్ కూడా 5 పరుగులు మాత్రమే చేసి స్టార్క్ బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక జాక్ క్రేలీ ఆచితూచి ఆడుతూ 76 పరుగులు చేసిన తర్వాత 27వ ఓవర్ 5 వ బంతికి నేసెర్ బౌలింగ్ లో అలెక్స్ క్యారీ కి క్యాచ్ ఇచ్చాడు. ఇక 39వ ఓవర్ లో హ్యారీ బ్రూక్ {31} స్టార్క్ బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×