E-Paper
Advertisement

H-1B Visa New Rule: సోషల్ మీడియా ‘పబ్లిక్’ లో ఉండాల్సిందే.. H-1B వీసాలపై మరో కఠిన నిబంధన

H-1B Visa New Rule: సోషల్ మీడియా ‘పబ్లిక్’ లో ఉండాల్సిందే.. H-1B వీసాలపై మరో కఠిన నిబంధన
Advertisement

H-1B Visa New Rule: అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కినప్పటి నుంచీ డొనాల్డ్ ట్రంప్ తీరు వివాదాస్పందం అవుతోంది. ఇటీవల హెచ్-1బీ వీసాల జారీపై ఆంక్షలు విధించిన ట్రంప్.. తాజాగా మరో కఠిన నిబంధన విధించింది. హెచ్-1బీ వీసాలకు దరఖాస్తులు చేసుకున్నవారి సోషల్ మీడియా ఖాతాల్లోనూ పబ్లిక్ యాక్సెస్‌లో ఉంచాలని కోరుతోంది.

H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ మరో కొత్త నిబంధన ప్రకటించింది. వీసా అధికారులు దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేసేలా అకౌంట్ సెట్టింగ్స్ ను ‘పబ్లిక్’ లో ఉంచాలని కోరుతోంది. H-1B, H-4 వీసా దరఖాస్తుదారులకు ఈ నిబంధన వర్తిస్తుందని ప్రకటించింది. ఇప్పటికే హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియ కష్టతరం చేయగా, తాజా నిబంధన ఆందోళన కలిగిస్తుంది.

సోషల్ మీడియా యాక్సెస్ కోసం

Advertisement

డిసెంబర్ 15 నుండి యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రతి H-1B, H-4 దరఖాస్తుదారుడి సోషల్ మీడియా ఖాతాలను సమీక్షించేందుకు అకౌంట్ సెట్టింగ్ పబ్లిక్‌గా ఉంచాలని కోరుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో F-1 వీసా దరఖాస్తుదారులకు కూడా ఇదే నియమం వర్తింపజేసింది. డిజిటల్ స్థాయి పరిశీలనలో భాగంగా ఈ నిబంధనను అమలుచేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. ట్రంప్‌కు వ్యతిరేకంగా మీమ్ లేదా రాజకీయ పోస్టులు ఉన్నాయా? తనిఖీలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రంప్ వ్యతిరేకంగా పోస్టులు ఉంటే వీసాను బ్లాక్ చేసే అవకాశం ఉందని చాలామంది భయపడుతున్నారు.

దరఖాస్తుదారులలో ఆందోళన

హెచ్-1బీ వీసా స్టాంపింగ్ కోసం వేచిచూస్తున్న వేలాది మంది భారతీయులకు ఈ నిబంధన మరొక అడ్డంకిగా మారనుందని భావిస్తున్నారు. దీనిని జాతీయ భద్రతకు ఒక మరో అడుగుగా యూఎస్ తెలుపుతుంది. వీసా కోరుకునేవారు తమ ఆన్‌లైన్ కార్యకలాపాలను తెలియజేయాలని సూచిస్తుంది.

Advertisement

హూస్టన్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఒకరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల జాబితాను తెలిపారు. ఇందులో Instagram, LinkedIn, Facebook, పాత సోషల్ మీడియా సైట్‌లు కూడా ఉన్నాయి. దరఖాస్తుదారులు వీసాలను పొందేందుకు సోషల్ మీడియా సెట్టింగ్స్ లో పబ్లిక్ ఆప్షన్ పెట్టాలని సూచించారు. అలాగే పరిపాలనకు అనుకూలమైన కంటెంట్‌ను పోస్ట్ చేయాల్సి రావచ్చు అని యూఎస్ న్యాయవాదులు అంటున్నారు.

వీసాలపై రుసుము పెంపు

ఈ నిబంధనలపై భారతీయ దరఖాస్తుదారులకు ఇమ్మిగ్రేషన్ నిపుణుల నుండి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. రక్షణ, సాంకేతికత కోసం అమెరికాకు నైపుణ్యం కలిగిన విదేశీయులు అవసరమని ట్రంప్ ఇటీవల ప్రకటన చేసినప్పటికీ, తాజా నిబంధనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే యూఎస్ ప్రతి H-1B వీసాపై 100,000 డాలర్ల రుసుమును విధించింది.

Also Read: US Air Force F-16 Crash: కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్.. వైరల్ అవుతోన్న వీడియో

సోషల్ మీడియా ఖాతాల తనిఖీలు ఎలా జరుగుతాయనే దానిపై స్పష్టత లేదు. డిసెంబర్ 15 తర్వాత వీసా అపాయింట్‌మెంట్‌లు ఉండనున్న తరుణంలో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. వ్యక్తిగత గోప్యతా విషయంలో ఆందోళన తలెత్తుతోంది. దీనిపై మరింత సమాచారం కోసం దరఖాస్తులు వేచి ఉండాల్సిందే.

Tags

Related News

యూకేలో అట్టహాసంగా జాతీయ చేనేత దినోత్సవం.. సంప్రదాయ చీరల్లో తెలుగు మహిళల సందడి!

Women’s Day Celebrations: లండన్ అట్టహాసంగా మహిళా దినోత్సవ వేడుకలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగు మహిళలు!

Saudi Arabia: పేరెంట్స్‌ని చంపి ఆత్మహత్య చేసుకున్న టీనేజర్, తెలుగు రాష్ట్రాలకు చెందినవారే, సౌదీలో దారుణం

Racist Attacks: భారతీయులపై జాత్యహంకార దాడులు.. ఫుడ్ బ్యాంక్ ఫొటోతో ఆన్‌లైన్‌లో దుమారం, అక్కడేం జరిగింది?

Jaahnavi Kandula Case: కందుల జాహ్నవి కేసు.. కీలక పరిణామం, ఫ్యామిలీకి రూ.262 కోట్ల పరిహారం

Elon Musk slams Canada hospital: కెనడాలో భారతీయుడి మృతిపై ఎలాన్ మస్క్ రియాక్షన్, ఆపై విమర్శలు

Indian Doctors: యూకేను వీడుతోన్న ఇండియన్ డాక్టర్స్.. అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×