Barron Trump: తన స్నేహితురాలు, రష్యన్ యువతిని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారెన్ ట్రంప్ కాపాడారు. బారెన్ చేసిన పనికి శుక్రవారం యూకే న్యాయమూర్తి అతడిని ప్రశంసించారు. 20 ఏళ్ల బారన్ ట్రంప్, గత ఏడాది తన స్నేహితురాలికి ఒక వీడియో కాల్ చేశారు. అయితే ఆ వీడియో కాల్‌లో షర్ట్ లేకుండా ఉన్న ఓ వ్యక్తి తన స్నేహితురాలిపై దాడి చేస్తుండడాన్ని గమనించి యూకే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బారెన్ ట్రంప్‌తో యువతి స్నేహం చేస్తుందన్న అసూయతో, రష్యా జాతీయుడైన 22 ఏళ్ల మత్వే రుమియాంత్సేవ్ ఆమెపై దాడి చేశాడని కోర్టు విచారణలో తేలింది. రుమియాంత్సేవ్ చేసిన నేరం రుజువు కావడంతో అతడికి యూకే కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
ట్రంప్ కుమారుడితో ఉన్న స్నేహంపై అసూయతో, రష్యన్ వ్యక్తి యువతిపై దాడి చేశాడు. రుమియాంత్సేవ్ యువతిని హింసిస్తున్న సమయంలో ఆమె స్నేహితుడు బారన్ ట్రంప్ నుంచి యువతికి ఫోన్ కాల్ వచ్చింది. ఆమెను కొడుతుండగా బారెన్ ట్రంప్ చూశాడు. ఆమెను దూషిస్తూ.. వీడియో తీశాడు. ఈ వీడియో చూసిన బారెన్ ట్రంప్ యూకే అత్యవసర సేవల వారికి సమాచారం అందించాడు. గతేడాది జరిగిన ఈ దాడి కేసులో శుక్రవారం యూకే కోర్టు రుమియాంత్సేవ్ దోషిగా తేల్చింది. ఇప్పటికే అతడిపై రెండు అత్యాచార ఆరోపణలు, ఒకరిపై దాడి ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల్లో నిర్దోషిగా విడుదలయ్యాడు. తాజాగా కేసులో అతడికి శిక్ష పడినా.. అందుకు తాను పశ్చాత్తాపపడటం లేదని అతడు కోర్టులో తెలిపాడు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌ల ఏకైక కుమారుడు బారెన్ ట్రంప్. అతడికి సోషల్ మీడియాలో రష్యన్ యువతితో స్నేహం కుదిరింది. ఆమెతో వీడియో కాల్ లో మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి జనవరి 18, 2025న అమెరికా నుండి బ్రిటిష్ పోలీసులకు బారెన్ ఫోన్ చేశారు. అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తాజాగా కోర్టు అతడికి నాలుగేళ్ల శిక్ష విధించింది.
Also Read: Trump Signature: చారిత్రక రికార్డు.. డాలర్ నోటుపై ట్రంప్ సంతకం